Vastu Plants In Home: ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అనేది కేవలం ఒక హాబీ మాత్రమే కాదు ఇది మన మనసుకు, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మొక్కలు చూడటం, వాటికి నీరు పోయడం, వాటి పెరుగుదలను గమనించడం మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా, మొక్కలు మన ఇంటికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయి, ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, కొన్ని మొక్కలు మన మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. మొక్కలు పెంచడం ద్వారా మనం పర్యావరణాన్ని రక్షించడంలో తోడ్పడుతున్నాము. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల ఇంట్లో ఇబ్బందులు , అశాంతి, ఆర్ధిక ఇబ్బుందులు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి మొక్కలను పెంచడం మంచిది కాదు అనేది తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెంచే మొక్కల ఎంపిక చాలా ముఖ్యమైనది. కొన్ని మొక్కలు సానుకూల శక్తిని వ్యాప్తి చేస్తే మరికొన్ని ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని నమ్ముతారు. అందుకే ఇంట్లో మొక్కలు పెంచేటప్పుడు వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం ఇంట్లో పెంచకూడని మొక్కలు ఏంటో తెలుసుకోండి..
ముళ్ల మొక్కలు పెంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కంటిచూపు చేదుగా ఉండే కాక్టి, ముళ్ల పొదలు వంటి మొక్కలు ఇంట్లో అశాంతిని కలిగిస్తాయని నమ్ముతారు. ఇవి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు కారణం కావచ్చు. అలాగే చనిపోయిన లేదా ఎండిపోయిన మొక్కలు ప్రతికూల శక్తిని వ్యాప్తి చేస్తాయి. వీటిని వెంటనే ఇంటి నుంచి తొలగించడం మంచిది. ఇంటి చుట్టూ పెద్ద చెట్లు ఉండటం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుందని నమ్ముతారు. ఇవి ఇంటికి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. పాము మొక్కను ఇంట్లో పెంచడం వల్ల నాగ దోషం ఏర్పడుతుందని నమ్ముతారు. అరటి చెట్టును ఇంటి ఆవరణలో పెంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని నమ్ముతారు. కొంతమంది ఆముదం చెట్టును పెంచుతుంటారు. కానీ దీని వల్ల దుష్టశక్తుల ప్రభావం పెరుగుతుందని చాలా మంది నిపుణులు నమ్ముతారు.
వాస్తు ప్రకారం ఇంట్లో పెంచవచ్చే మొక్కలు:
ఈ మొక్కలకు బదులుగా ఇంట్లో వేరేవి పెంచవచ్చు. అందులో ఒకటి తులసి మొక్క. ఇది ఇంట్లో సానుకూల శక్తిని వ్యాప్తి చేస్తుంది. మనీ ప్లాంట్ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని నమ్ముతారు. లవెండర్ మొక్క శాంతిని, నిద్రను ప్రేరేపిస్తుంది. ఇందులో వీటిని వివిధ దిశలో పెంచాల్సి ఉంటుంది.
తూర్పు దిశ: తూర్పు దిశ సూర్యోదయానికి సంబంధించినది. ఈ దిశలో ఆరోగ్యకరమైన మొక్కలను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.
ఉత్తర దిశ: ఉత్తర దిశ నీటిని సూచిస్తుంది. ఈ దిశలో నీటిని ఇష్టపడే మొక్కలను ఉంచడం మంచిది.
దక్షిణ దిశ: దక్షిణ దిశ అగ్నిని సూచిస్తుంది. ఈ దిశలో కొన్ని రకాల మొక్కలను మాత్రమే ఉంచాలి.
పడమర దిశ: పడమర దిశ గ్రహాలను సూచిస్తుంది. ఈ దిశలో మొక్కలను ఉంచేటప్పుడు జాగ్రత్త వహించాలి
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.