Mercury Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహం రాశి సంచారం చేయడం చాలా శుభప్రదం. ఈ గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ అశుభ పరిణామాలు ఏర్పడతాయి. దీని కారణంగా వ్యక్తిగత జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు బుధుడు మకర రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి చాలా అదృష్టంగా ఉంటుందని ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారని నిపుణులు తెలుపుతున్నారు. బుధ గ్రహ సంచారం కారణంగా ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి:
బుధుడు మకర రాశిలోకి సంచారం చేయడం కారణంగా సింహ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పటినుంచో వ్యాపారాలు ఉన్న ఇబ్బందులన్నీ ఈ సమయంలో సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా బుధుడు అనుగ్రహంతో విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు సింహ రాశి వారు వారి పిల్లలను కూడా శుభవార్తలు అందుకుంటారు. ఇక ఎప్పటినుంచో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది.
మేషరాశి:
మేష రాశి వారికి బుధుడు సంచారం చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఇంతకుముందు వ్యాపారాలు నష్టాల్లో కొనసాగితే ఈ సంచారం నుంచి లాభాల్లో కొనసాగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో తోటి ఉద్యోగుల మద్దతు లభించి కార్యాలయాల్లో మంచి పేరు పొందుతారు. అంతేకాకుండా కుటుంబంతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో కూడా మాధుర్యం పెరుగుతుంది.
మిథున రాశి:
మకర రాశిలోకి బుధుడు సంచారం చేయడం కారణంగా ఏర్పడే ప్రభావం మిథున రాశి వారిపై కూడా పడుతుంది. దీని కారణంగా భవిష్యత్తు వ్యాపారాలకు సంబంధించిన ప్రణాళికల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. దీంతోపాటు వీరు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిది.. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బుధుడి అనుగ్రహంతో నిలిచిపోయిన పనులన్నీ సులభంగా పరిష్కారం అవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter