Gudi Padwa 2023 Date: మహారాష్ట్ర మరియు కొంకణి ప్రజలు కొత్త సంవత్సరాది గుడి పడ్వాతో ప్రారంభమవుతుంది. అయితే ఈరోజునే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉగాది లేదా యుగాదిగా జరుపుకుంటారు. అంతేకాకుండా సింధీ హిందువులు ఈ రోజును చెట్టి చంద్ పేరుతో జరుపుకుంటారు. గుడి పడ్వా యొక్క తేదీ, శుభ సమయం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
తేదీ, పూజా మహూర్తం
హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసంలో శుక్ల పక్షం మొదటి రోజున గుడి పడ్వా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ పండుగ మార్చి 22, బుధవారం వస్తుంది. ఆరోజు ఉదయం 6.29 నుండి 7.39 వరకు గుడి పడ్వా పూజకు శుభ ముహూర్తం ఉంది.
గుడి పడ్వా యొక్క ప్రాముఖ్యత
ఈరోజునే బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడు. అందుకే ఈరోజున బ్రహ్మను పూజిస్తారు. అంతేకాకుండా ఈరోజు నుంచే నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ 9 రోజులు దుర్గామాతను పూజిస్తారు. ఈ పర్వదినానే రైతులు కొత్త పంటలు వేస్తారు. ఈ పవిత్రమైన రోజునే ఛత్రపతి శివాజీ మహారాజ్ విదేశీ చొరబాటుదారులపై విజయం సాధించారు. పురాణాల ప్రకారం, రావణుడిని ఓడించి శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకున్న రోజు కూడా ఇదేనని నమ్ముతారు.
Also Read: Shani uday 2023: హోలీ ముందు ఈ రాశులకు పట్టనున్న అదృష్టం... ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook