Guru Chandra yuti 2024: జనవరి మూడో వారంలో అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారిపై కనక వర్షం..

Moon transit 2024: ఈ నెలలో చంద్రుడు.. బృహస్పతితో కలిసి గజకేసరి రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాడు. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులు గురించి తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2024, 11:44 AM IST
Guru Chandra yuti 2024: జనవరి మూడో వారంలో అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారిపై కనక వర్షం..

Guru Chandra Yuti in Mesh 2024:  జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జనవరి నెలలో కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. ఈ గ్రహాల రాశి మార్పు వల్ల కొన్ని అరుదైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి గజకేసరి రాజయోగం. ఏదైనా రాశిలో చంద్రుడు మరియు గురుడు కలిసినప్పుడు ఈ పవిత్రమైన యోగం రూపొందుతోంది. ప్రస్తుతం బృహ్పతి మేషరాశిలో సంచరిస్తున్నాడు. జనవరి 18న అదే రాశిలోకి చంద్రుడు ప్రవేశించనున్నాడు. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం జనవరి 20, ఉదయం 8.53 గంటలకు ముగియనుంది.  చంద్రుడు, గురుడు కలయిక వల్ల జనవరి 18, 19 తేదీల్లో కొందరి అదృష్టం మారనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మేషరాశి
ఇదే రాశిలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. దీంతో జనవరి 18, 19 తేదీల్లో మేషరాశి వ్యక్తులు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈ రెండ్రోజుల్లో శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి సమయం గడుపుతారు. 
కర్కాటక రాశి
జనవరిలో ఏర్పడబోతున్న గజకేసరి రాజయోగం వల్ల కర్కాటక రాశి వారి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీరు విలువైన వస్తునులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల జీతాలు పెరుగుతాయి. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీకు సంతానప్రాప్తి కలగవచ్చు. 
వృశ్చిక రాశి
చంద్రుడి రాశి మార్పు వల్ల సంభవించబోతున్న గజకేసరి రాజయోగం వృశ్చిక రాశి వారికి ఊహించనంత ధనాన్ని ఇస్తుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా దానికి ఫ్యామిలీ సహకారం ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. బిజినెస్ చేసే వారు మంచి లాభాలను ఆర్జిస్తారు. 

Also Read: January Lucky Zodiac Signs: జనవరి నెల అదృష్ట రాశుల వారి వీరే..నెల మొత్తం లాభాలే లాభాలు..

మిధునరాశి
చంద్రుడు మరియు గురుడు కలయిక వల్ల మిథునరాశి వారు చాలా డబ్బు సంపాదిస్తారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. 
తులారాశి
రాజయోగం వల్ల తులరాశి వారి ఆందోళనలన్నీ తొలగిపోతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీరు ఫ్రెండ్స్ తో టూర్ కు వెళతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ కంప్లీట్ అవుతాయి. 

Also Read: Lucky Zodiac Signs: నవపంచమి యోగం ప్రభావం, ఆ 4 రాశులకు ఊహించని ధనలాభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News