హిందూ జ్యోతిష్యం ప్రకారం నిర్ణీత సమయంలో ప్రతి గ్రహం రాశి మారుతుంటుంది. దాంతో పాటు ఏదైనా గ్రహం సూర్యునికి సమీపంలో వెళ్లినప్పుడు ఆస్థిత్వం లేదా ప్రభావం కోల్పోతుంది. గ్రహం అస్థిత్వం కోల్పోవడం జ్యోతిష్యం ప్రకారం మంచిది కాదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
గ్రహం అస్థిత్వమైతే ఆ గ్రహం బలహీనమౌతుంది. దాంతో అశుభ ఫలాలు ఇస్తుంది. ఏప్రిల్ నెలలో దేవగురు గురు గ్రహం అస్థిత్వం కోల్పోనుంది. గురు గ్రహం అస్థిత్వం కోల్పోవడం వల్ల 3 రాశులకు ఏమాత్రం మంచిది కాదు. ఈ రాశులు ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురు గ్రహం అస్థిత్వం కోల్పోవడం వల్ల ఏయే రాశులకు ప్రమాదమో తెలుసుకుందాం..
వృషభరాశి
గురు గ్రహం అస్థిత్వం కోల్పవడం వల్ల వృషభరాశికి మంచి పరిణామం కాదు. వృషభరాశికి అధిపతి శుక్రుడు, గురువు మద్య శతృత్వం ఉంది. అయితే వృషభ రాశి జాతకులకు గురువు అస్థిత్వం కోల్పోవడం వల్ల ధనహాని కలుగుతుంది. ఆదాయం తగ్గిపోతుంది. పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సమయం కాదు. కొత్త పనులు కూడా చేయవద్దు. వ్యాపారులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారం ప్రారంభించవద్దు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు గురు గ్రహం అస్థిత్వం కోల్పోవడం వల్ల చాలా నష్టం కలగనుంది. పనులు ఆటంకం ఎదుర్కొంటారు. కష్టపడినా ప్రయోజనం ఉండదు. దాంతోపాటు యాత్రలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు చేయాల్సివస్తే ఆరోగ్యంపై తమ సామానుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
కన్యారాశి
గురు గ్రహం ఆస్థిత్వం కోల్పోవడం వల్ల కన్యారాశికి మంచి పరిణామం కాదు. ఈ రాశి జాతకులకు కష్టాలు పెరుగుతాయి. అధిక ఒత్తిడి ఉంటుంది. ప్రత్యేకించి వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదురౌతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది. ఏదైనా వ్యాధి చుట్టుముట్టవచ్చు. పని ఒత్తిడి ఉంటుంది. సహచరులతో వివాదానికి దిగవద్దు.
Also read: Shani Ast 2023: జనవరి 30 నుంచి అస్థిత్వం కోల్పోనున్న శనిగ్రహం, 5 రాశులకు అంతా దౌర్బాగ్యమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook