Budh Gochar 2022: తులరాశిలో సంచరిస్తున్న బుధుడు.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు..

Budh Gochar 2022: రెండు రోజుల కిందట బుధుడు తులరాశిలోకి ప్రవేశించాడు.  మెర్క్యూరీ సంచారం కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2022, 11:46 AM IST
Budh Gochar 2022:  తులరాశిలో సంచరిస్తున్న బుధుడు.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు..

Budh Gochar 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల మార్పుకు ప్రత్యేకత ఉంది. ఈనెల 26న బుధుడు తులరాశిలోకి ప్రవేశించాడు. నవంబరు 29వరకు అదే రాశిలో ఉండనున్నాడు. ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. ఇతడు తెలివితేటలు, కమ్యూనికేషన్ కు కారకుడిగా భావిస్తారు. మెర్య్కూరీ యెుక్క ఈ సంచారం (mercury transit in libra 2022) కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

బుధుడి రాశి మార్పు ఈ రాశులకు అనుకూలం
మిథునరాశి (Gemini)- తులారాశిలో బుధుడు సంచరించడం మిథునరాశి వారికి కలిసి వస్తుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. విద్యార్థులు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. బుధ సంచార కాలంలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. 
కర్కాటకం (Cancer)- కన్యారాశి వారికి బుధ సంచారం ప్రత్యేకం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆఫీసులో ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులు ధనలాభం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. విద్యారంగంలో పురోగతి ఉంటుంది. 
సింహ రాశి (Leo)- బుధుడి రాశి మార్పు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మతపరమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులు ఆర్థికంగా లాభపడతారు. భూమికి సంబంధించిన పనుల వల్ల ధనలాభం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 
ధనుస్సు (Sagittarius)- బుధుడు రాశి మారడం వల్ల ఈ రాశివారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.  

Also Read: Lakshmi Narayana Yogam: బుధ-శుక్రుల లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులవారి ఖజానా నిండటం ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News