Parivartini Ekadashi 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికే జల్జుల్ని ఏకాదశి, పద్మ ఏకాదశి అని పేర్లు కలవు. పరివర్తినీ ఏకాదశి రోజున ఉపవాసం పాటించి... మరుసటి రోజైనా ద్వాదశి నాడు విరమిస్తారు. ఈ ఏడాది పరివర్తిని ఏకాదశి వ్రతాన్ని రేపు అంటే సెప్టెంబరు 6, 2022 మంగళవారం నాడు జరుపుకోనున్నారు.
చాతుర్మాసం నాలుగు నెలలు శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. అయితే భాద్రపద మాస ఏకాదశి నాడు శ్రీహరి తన వైపును మార్చుకుంటాడు. అందుకే దీనిని పరివర్తినీ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వాజపేయ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ ఉపవాసం పాటిస్తే శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై ప్రజల కష్టాలను తీరుస్తాడు.
పరివర్తిని ఏకాదశి నాడు అరుదైన యాదృచ్ఛికం..
ఈ సంవత్సరం పరివర్తిని ఏకాదశి నాడు చాలా పవిత్రమైన యాదృచ్ఛికం ఏర్పడబోతుంది. ఈ రోజున కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం ఆయుష్మాన్ యోగం, మిత్ర యోగం, రవియోగం మొదలవుతాయి. దీని తర్వాత సౌభాగ్య యోగం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా, ఈ ఏకాదశి నాడు, 4 ప్రధాన గ్రహాలు సూర్యుడు, బుధుడు, గురు మరియు శని వారి వారి రాశిల్లో ఉంటారు. ఇటువంటి సమయంలో ఏకాదశి వ్రతం చేయడం వల్ల మీరు అనేక శుభఫలితాలను పొందుతారు.
పరివర్తిని ఏకాదశి రోజున ఈ పని చేయకండి
>> పరివర్తిని ఏకాదశి రోజున అన్నం తినకూడదు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండని వారు కూడా ఆహారం తీసుకోకూడదు.
>> ఏకాదశి రోజున నాన్ వెజ్-ఆల్కహాల్ తీసుకోవద్దు. మీరు ఉపవాసం చేయకపోయినా తామసమైన విషయాలకు దూరంగా ఉండండి మరియు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి.
>> ఏకాదశి రోజున ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి, కోపం తెచ్చుకోకండి. ఈ రోజున మీరు భక్తిలో లీనమవ్వండి.
>> ఏకాదశి నాడు ఉపవాసం ఉండే వారు బ్రహ్మచర్యాన్ని పాటించాలి.
Also Read: Grah Gochar: సెప్టెంబరులో గ్రహాల సంచారం... ఈ రాశులవారికి టన్నుల కొద్ది అదృష్టం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook