Indians in Ukraine: భారతీయులకోసం పోలండ్ కీలక నిర్ణయం- వీసా లేకున్నా ఎంట్రీ!

Indians in Ukraine: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులకోసం పోలండ్ కీలక నిర్ణయం తీసుకుంది. వీసా లేకున్నా తమ దేశంలోకి భారతీయులను అనుమతించాలని నిర్ణయించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 08:47 PM IST
  • ఇండియన్స్​కు పోలండ్ ఊరట
  • ఉక్రెయిన్​లో చిక్కున్న వారికి వీసా లేకున్నా అనుమతి
  • రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నిర్ణయం
Indians in Ukraine: భారతీయులకోసం పోలండ్ కీలక నిర్ణయం- వీసా లేకున్నా ఎంట్రీ!

Indians in Ukraine: యురోపియన్ దేశమైన పోలాండ్ ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులకోసం గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆందోళన పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయులు స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఉక్రెయిన్ గగనతలం మూసేసిన కారంగా సమీప దేశాలకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లి.. అక్కడి నుంచి ఇండియాకు విమానాల్లో చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్​తో భూ మార్గమున్న పోలండ్ దేశం.. భారతీయులు వీసా లేకుండానే తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని.. ఇండియాలోని పోలండ్ అంబాసిడర్​ అడమ్​ బురాకోవిస్కీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారిక ప్రకటన చేశారు.

సంక్షోభం నేపథ్యంలో పోలండ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం ఉక్రెయిన్​లో చిక్కుకున్న వందలాది మంది భారతీయులకు ఎంతో ఊరటనిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

కొనసాగుతున్న ఆపరేషన్ గంగా..

భారత ప్రభుత్వం ఇప్పటికే ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఆపరేషన్ గంగాను చేపట్టింది. రొమానియా సహా ఉక్రెయిన్​కు సమీపంలోని ఇతర దేశాల ద్వారా ప్రత్యేక విమానాల్లో పౌరులను భారత్​కు తీసుకొస్తోంది. ఇందుకు అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తున్నట్లు సమాచారం.

ఆపరేషన్ గంగాలో భాగంగా.. నిన్న 219 మందితో తొలి విమానం బయల్దేరింది. 198  మందితో కూడిన నాలుగో విమానం కొద్ది సేపటి క్రితం బయల్దేరింది. ఈ ఆపరేషన్ కోసం ఎయిర్ ఇండియా విమానాలను వినియోగిస్తోంది ప్రభుత్వం.

చర్చలకు రెడీ..

మరోవైపు రష్యా- ఉక్రెయిన్​లో చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి సిద్ధమయ్యాయి. బెలారుస్​ వేదికగా ఇరు దేశాలు చర్చలు జరపనున్నాయి.

Also read: Russia Ukraine War: బెలారస్ వేదికగా చర్చలకు సిద్ధమైన రష్యా, ఉక్రెయిన్... యుద్ధానికి తెరపడేనా..?

Also read: Russia Ukraine War: యూనివర్సిటీ బంకర్‌లో తలదాచుకున్న భారతీయ విద్యార్థిని.. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News