హిందూమతంలో జ్యోతిష్యానికి అధిక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు గ్రహాలకు రాజు. ప్రతి నెలా రాశి మారుతుంటాడు. నవంబర్ 16న అంటే రేపు సూర్యుడి రాశి పరివర్తనం కారణంగా ఆ రాశులకు అంతా శుభ సూచకం కానుంది.
నవంబర్ 16వ తేదీన సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా 5 రాశుల జాతకుల కెరీర్, ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా లాభపడనుంది. సూర్య గోచారంతో వృశ్చిక రాశిలో డిసెంబర్ 16 వరకూ ఉంటుంది. సూర్య గోచారంలోని ఈ నెలరోజుల్లో 5 రాశుల కెరీర్, ఆర్ధిక వ్యవహారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. ఏయే రాశులకు ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం..
సూర్య గోచారంతో మెరిసిపోనున్న ఈ రాశుల జాతకం
కర్కాటరాశిపై సూర్యుడి వృశ్చిక రాశి ప్రవేశం ప్రభావం అద్భుతంగా ఉండనుంది. కెరీర్‌కు మంచి అనువైన సమయం. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి చాలా మంచిది. పనుల్లో విజయం లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. యాత్రలు చేస్తారు.
సింహరాశిపై సూర్యుడి గోచారం ప్రభావం లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. సంపదతో లాభాలు ఆర్జిస్తారు. ధనలాభముంటుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. పొదుపు చేస్తారు. పెట్టుబడులకు మంచి సమయం.
తులారాశి జాతకులకు సూర్యుడి వృశ్చికరాశి పరివర్తనం అమితమైన లాభాల్ని అందిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ధనలాభం కలుగుతుంది. సేవింగ్ లాభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబసభ్యులతో బాగుంటుంది. పెట్టుబడులకు అనువైన సమయం.
వృశ్చికరాశి వారికి సూర్యుడి గోచారం కలిసొస్తుంది. అన్ని రాశుల కంటే ఎక్కువగా వృశ్చికరాశిపై పడుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి కలగనుంది. వ్యాపారంలో డీల్స్ చేతికందుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కుంభరాశి జాతకులకు సూర్యుడి రాశి పరివర్తనం కారణంగా ధనలాభం ఉంటుంది. ఆదాయంలో ఊహించని లాభాలుంటాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. నిలిచిపోయిన పదోన్నతి లభిస్తుంది. ప్రశంసలు దక్కుతాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.
Also read: Guru Margi 2022: ఈ రాశిలో బృహస్పతి సంచారం.. ఆ రాశువారికి ఆర్థిక సమస్యలు చెక్.. డబ్బే..డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook