Sun Transit In Meen Rashi Effect These Zodiac Signs: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తుంది. ఈ గ్రహాల కదలిక కొన్ని రాశులపై సానుకూలంగానూ, మరికొన్ని రాశులపై ప్రతికూలంగానూ ఉంటుంది. మార్చి 15న సూర్యుడు మీనరాశిలో సంచరించాడు. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. సూర్యుడి గోచారం మూడు రాశుల మీద వ్యతిరేక ప్రభావం చూపించనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
సూర్యుడి సంచారం ఈ రాశులకు ప్రతికూలం
మేష రాశి
సూర్యదేవుడు తన రాశిని మార్చిన తర్వాత మేషరాశిలోని 12వ ఇంటి గుండా పయనించాడు. ఇది మీకు హానికరం. ఈ సమయంలో మీరు ఖర్చులను తగ్గించుకోవాలి, లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోతారు. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. ఈ టైంలో మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తవచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
కన్యా రాశి
ఈ రాశి యెుక్క 7వ ఇంటి గుండా సూర్యుడు సంచరించాడు. దీంతో కన్యారాశి వారు అశుభ ఫలితాలను పొందుతారు. మీ లైఫ్ పార్టనర్ ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. మీరు కొత్త పని లేదా వ్యాపారం ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం కాదు. మీకు ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
మీన రాశి
ఈ రాశి యెుక్క మూడవ ఇంట్లో సూర్యుడి రాశి మార్పు జరిగింది. మీనరాశిలో సూర్యుని మార్పు మీ జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో మీ తోబుట్టువులతో విభేదాలు రావచ్చు. కాబట్టి వాదించడం మానుకోండి. మీరు ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ సమయం సరికాదు.
Also Read: Guru Gochar 2023: రేర్ రాజయోగం చేస్తున్న బృహస్పతి.. ఈ రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook