Sun Transit January 2023: గ్రహాల రాజు సూర్యదేవుడు రాశి మార్చడాన్నే సంక్రాంతి అంటారు. సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. ఇలా సంవత్సరమంతా పన్నెండు రాశుల్లో సంచరిస్తాడు. కొత్త ఏడాదిలో అంటే జనవరి 14, 2023న సూర్యుడు మకరంలోకి ప్రవేశించనున్నాడు. దీన్నే మకర సంక్రాంతి అంటారు. మకర రాశికి అధిపతి శనిదేవుడు. శని రాశిలో సూర్య సంచారం ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. సూర్య సంచారం వల్ల నాలుగు రాశులవారు శుభ ఫలితాలను సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మకర సంక్రాంతితో ఈ రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది
వృషభం (Taurus): సూర్యుని రాశి మార్పు వల్ల వృషభ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో విజయాల్లో సాధిస్తారు. మీకు ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులు పెద్ద పెద్ద ఆర్డర్లును పొందుతారు. వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. మీ పనికి ప్రసంసలు దక్కుతాయి.
మిథునరాశి (Gemini): సూర్యుని సంచారం మిథునరాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు. పరిశోధన రంగానికి సంబంధించిన వ్యక్తులు విశేష ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడే అవకాశం ఉంది.
కర్కాటకం (Cancer): మకరరాశిలో సూర్యుడు ప్రవేశించడం ఈ రాశివారికి శుభప్రదం. మీకు లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. భాగస్వామ్యంతో చేసే వ్యాపారులు భారీగా లాభపడతారు.పెళ్లికానీ యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. బిజినెస్ చేసే వారు పెద్ద డీల్ ను కుదుర్చుకుంటారు.
మకరం (Capcricorn): శనిదేవుడి యెుక్క రాశిలో సూర్యదేవుని సంచారం వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు.
Also Read: Vipreet Rajyog 2023: నూతన సంవత్సరంలో అరుదైన రాజయోగం.. ఈ 3 రాశులకు ఆకస్మిక ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook