Vastu Shastra: రాత్రిపూట మరచిపోయి కూడా ఈ పనులు చేయకండి.. మీరు పేదవారిగా మారవచ్చు!

Vastu Shastra: భారతీయ సంస్కృతిలో రాత్రిపూట కొన్ని పనులు నిషేధించబడ్డాయి. ఇవీ చేస్తే.. మీరు ఆరోగ్యం మరియు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. రాత్రిపూట మనం ఎప్పుడూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2022, 08:31 AM IST
  • లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే
  • రాత్రిపూట ఈ పనులు చేయకండి
Vastu Shastra: రాత్రిపూట మరచిపోయి కూడా ఈ పనులు చేయకండి.. మీరు పేదవారిగా మారవచ్చు!

Vastu Shastra: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో మనిషి చిన్న చిన్న తప్పులు చేస్తూ...లక్ష్మీదేవి ఆగ్రహానికి గురువుతున్నాడు. పురాణాల ప్రకారం, మీరు రాత్రిపూట ఇలాంటి పనిచేస్తే.. లక్ష్మీదేవి (Goddess  Lakshmi) కోపానికి బలవుతారు. తద్వారా మీ ఇంట్లో ఆనందం మరియు ఐశ్వర్యం శాశ్వతంగా పోతుంది. రాత్రిపూట ఎప్పుడూ చేయకూడని పనులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. 

రాత్రిపూట మురికి పాత్రలను కడగకుండా ఉంచవద్దు
చాలా మంది ఆహారం తిన్న తర్వాత మురికి పాత్రలను వంటగదిలో వదిలేస్తారు. సనాతన ధర్మ గ్రంథాల ప్రకారం, వంటగది అన్నపూర్ణ తల్లి (Goddess Annapurna) నివాసంగా పరిగణించబడుతుంది. మీరు రాత్రంతా వంటగదిలో మురికి పాత్రలను వదిలేయడం తల్లి అన్నపూర్ణను అవమానించినట్లుగా భావిస్తారు.  దీంతో కుటుంబం మెుత్తం భారీ స్థాయిలో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంంది. అందుకే రాత్రిపూట ఎప్పుడూ మురికి పాత్రలను కడగాలి.

సూర్యాస్తమయం తర్వాత చీపురును వాడవద్దు
మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి చీపురు వాడతారు. కానీ మరచిపోయి కూడా రాత్రిపూట చీపురుతో ఊడ్చకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చడం సరైనది కాదు. ఈ సమయం దేవతలకు సంబంధించింది. అటువంటి పరిస్థితిలో, రాత్రిపూట తుడుచుకోవడం వారి విశ్రాంతికి భంగం కలిగిస్తుంది. దీని కారణంగా వారు మీపై ఆగ్రహించవచ్చు.  అందుకే రాత్రిపూట చీపురు ఉపయోగించవద్దు.

గోళ్లను కత్తిరించవద్దు
మన శుభ్రత కోసం చేతులు మరియు కాళ్ళ గోళ్ళను ఎప్పటికప్పుడు కత్తిరించడం అవసరం. కానీ రాత్రిపూట ఎప్పుడూ గోళ్లను కత్తిరించవద్దు. దీనికి కారణం రాత్రిపూట గోరును కత్తిరించేటప్పుడు దాని ముక్క మీ కంటిలో పడవచ్చు. ఒక్కోసారి దానిని తీయడం చాలా కష్టం కావచ్చు.  

వంటగదిని శుభ్రం చేసి రాత్రి పడుకోండి
భారతీయ మత గ్రంథాల ప్రకారం, వంటగదిని రాత్రిపూట ఎప్పుడూ మురికిగా ఉంచకూడదు. పడుకునే ముందు అన్ని పాత్రలను కడిగిన తర్వాత వంటగదిని శుభ్రం చేయాలి. మీరు దీన్ని చేయకపోతే, వంటగదిలో ప్రతికూల శక్తి ప్రసారం చేయబడుతుంది, దీని ప్రభావం మరుసటి రోజు మీపై ఉంటుంది. అందుకే చిన్న సమస్య ఉన్నా రాత్రి కిచెన్ కడిగిన తర్వాతే నిద్రపోవాలి.

Also Read: Vastu Tips for Haldi Plant: ఇంట్లో పసుపు మెుక్కను నాటడం శుభప్రదమా? వాస్తు శాస్త్రం ఏమి చెబుతుంది?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News