Vastu Tips: మీరు ఇంట్లో చిలుకలను పెంచుతున్నారా? ఈ విషయాలు ముందుగా తెలుసుకోండి!

Vastu Animals For Home: చిలుకలను పెంచడం అనేది ఎంతో శ్రద్ధతో కూడిన పని. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం చిలుకలను పెంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. చిలుకలను పెంచే ముందు వాస్తు నిపుణులు తెలిపే వివిరాలను తెలుసుకోండి

Written by - Shashi Maheshwarapu | Last Updated : Sep 13, 2024, 02:50 PM IST
Vastu Tips: మీరు ఇంట్లో చిలుకలను పెంచుతున్నారా? ఈ విషయాలు ముందుగా తెలుసుకోండి!

Vastu Animals For Home: ప్రస్తుతంకాలంలో చాలా మంది ఇంట్లోనే అనేక రకాల జంతువులను పెంచుకుంటున్నారు. అందులో ముఖ్యంగా కుక్క, పిల్లి, కుందేలు, చేపలు, చిలుకలను ఇలా ఎన్నో పెంపుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల జంతువులను ఇంట్లో పెంచుకోవడం వల్ల దరిద్రం పడుతుందని, నష్టాలు, దోశాలు కలుగుతాయని చెబుతున్నారు. అందులోను ముఖ్యంగా పక్షుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది చిలుకను పెంచుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం చిలుకను ఎలా పెంచుకోవాలి? ఎవరకు ఉంచకూడదు? అనే వివిరాలను తెలుసుకుందాం. 

చిలుకను ఉంచుకోవాలా వద్దా?

చిలుకలు మన భారతీయ సంస్కృతిలో పవిత్రమైన పక్షులుగా భావిస్తారు. అంతేకాకుండా చిలుకలు జ్ఞానానికి ప్రతీక. ఇవి ఇంట్లో ఉండటం వల్ల పిల్లల చదువుపై ఆసక్తి పెరుగుతుంది, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అని నమ్ముతారు. చిలుక ఉండటం వల్ల ఇంట్లోని వారికి అనారోగ్యం తగ్గుతుంది అని కూడా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని ఇంటిలో పెంచడం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం అని అంటున్నారు. చిలుకలను పంజరంలో బందిస్తుంటారు. ఇది శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో కలతలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్యసమస్యలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చిలుకలను పంజరంలో ఉంచడం మంచిది కాదు. 

వాస్తు శాస్త్రం ప్రకారం ఏ వ్యక్తులు చిలుకలను పెంచకూడదు?

ఇంట్లో ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, కుటుంబ సభ్యులతో సరిగా ఉండని వారు చిలుకను ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చిలుకలకు రోజూ చాలా సమయం అవసరం. వాటితో ఆడటం, శుభ్రం చేయడం, వాటికి శిక్షణ ఇవ్వడం వంటివి చేయాలి. మీరు చాలా బిజీగా ఉంటే, చిలుకను పెంచడం సరైనది కాదు.

ఇంట్లో చిలుకల బొమ్మ పెట్టవచ్చా?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చిలుకల బొమ్మను ఉంచడం ఎంతో శుభప్రదం. ముఖ్యంగా బెడ్‌ రూంలో చిలుకల జంట బొమ్మలు ఉండటం వల్ల భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పిల్లలు చదువుకొనే గదిలో కూడా వీటిని ఉంచవచ్చు. దీని విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 

చిలుకను పెంచాలనుకుంటే:

చిలుకల అనేక రకాలు ఉన్నాయి. ప్రతి రకమైన చిలుకకు వేర్వేరు సంరక్షణ అవసరం. ఏ రకమైన చిలుకను పెంచాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. వాటికి సంబంధించిన ఆహారం, వాతావరణం పైన అవగాహాన పెంచుకోండి. అలాగే చిలుకలకు రోజూ ఎంత సమయం ఇవ్వగలరో ఆలోచించండి. ఇల్లు చిలుకకు తగినంత పెద్దగా ఉందా అని ఆలోచించండి. ఎలాంటి సంరక్షించ  అవసరం అనేది ముందుగా నిపుణులను సంప్రదించండి.

గమనిక:

ఈ సమాచారం సాధారణ సమాచారం మాత్రమే. చిలుకను పెంచే ముందు, నిపుణులను సంప్రదించడం మంచిది.

Also read: Immunity System: రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని తేలిపే 7 సంకేతాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter

 

 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x