Venus Transit 2023: కన్యా రాశిలో శుక్రుడు, ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం

Venus Transit 2023: హిందూమతంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అందుకే జాతకం ప్రకారం ఏ గ్రహం ప్రభావం ఉంటుందనేది ముందుగా తెలుసుకుంటుంటారు. అదే సమయంలో ఆ గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం చూపిస్తుందంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 17, 2023, 07:58 AM IST
Venus Transit 2023: కన్యా రాశిలో శుక్రుడు, ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం

Venus Transit 2023: జ్యోతిష్యం ప్రకారం శుక్ర గ్రహాన్ని ఆరోగ్యం, తెలివితేటలు, సంతృప్తితో పాటు అష్ట ఐశ్వర్యాలకు ప్రతీకగా భావించే శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశించడం 3 రాశులపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ మూడు రాశులపై కనకవర్షం కురుస్తుందంటున్నారు. 

జాతకంలో కుండలి అనేది జ్యోతిష్యం ప్రకారం చాలా ప్రభావవంతమైంది. కుండలిలో గ్రహం స్థితిని బట్టి ఆ వ్యక్తి జాతకం ఉంటుంది. అదే విధంగా కుండలిలో శుక్రుడు బలమైన స్థితిలో ఉంటే ఆ వ్యక్తి జాతకం చాలా బాగుంటుంది. ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అద్భుతంగా సంపాదిస్తారు. అదే కుండలిలో శుక్రుడి స్థితి బలహీనంగా ఉంటే మనిషి జీవితంలో ఆనందం పోతుంది. ఒడిదుడుకులు ఎదురౌతాయి. చేపట్టిన పనులు ఆగిపోతాయి. శుక్రుడు నవంబర్ 3వ తేదీన కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 3 రాశులపై ఊహించని విధంగా డబ్బులు వచ్చిపడనున్నాయి. అంటే దీపావళికి ముందే ఆ వ్యక్తి జీవితంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. 

కన్యా రాశి జాతకులకు శుక్రుడు ఈ రాశిలో ప్రవేశించడం వల్ల అదృష్టం వికసిస్తుంది. జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. పెద్దమొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగులుకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తే..వ్యాపారులు విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. నలుగురిలో గుర్తింపు ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

వృశ్చిక రాశి జాతకులపై శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావం విశేషంగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పనిచేసే చోట మీ పనికి గుర్తింపుతో పాటు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యపరంగా పరిశీలిస్తే ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు కలిసొస్తుంది. పదోన్నతితో పాటు కోరుకున్న చోటికి బదిలీ ఉంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. వ్యాపారంలో పోటీని తట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి.

శుక్రుడి గోచారం ప్రభావంతో కన్యా రాశి జాతకులకు అన్నీ సానుకూల పరిణామాలే ఎదురౌతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలుంటాయి. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కలిసొస్తాయి. కెరీర్‌లో కోరుకున్న స్థానానికి చేరుకుంటారు. ఆదాయం పెరగడం వల్ల ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం బాగుంటుంది. తీర్ధయాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయి. 

Also read: Chandra Grahan 2023: శరద్ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం.. ఈ 2 రాశులపై ప్రతికూల ప్రభావం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News