క్వారంటైన్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఏం చేస్తున్నారో తెలుసా ?

కరోనావైరస్ వ్యాప్తిని (Coronavirus spread) కట్టడి చేసేందుకు యావత్ దేశం లాక్‌డౌన్ (Lockdown) పాటిస్తుండటంతో నిత్యం రకరకాల పనులతో బిజీగా ఉండే క్రీడాకారులు, సినిమా సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమయ్యారు (Celebrities in quarantine).

Last Updated : Mar 28, 2020, 02:21 PM IST
క్వారంటైన్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఏం చేస్తున్నారో తెలుసా ?

కరోనా వైరస్ వ్యాప్తిని (Coronavirus spread) కట్టడి చేసేందుకు యావత్ దేశం లాక్‌డౌన్ (Lockdown) పాటిస్తుండటంతో నిత్యం రకరకాల పనులతో బిజీగా ఉండే క్రీడాకారులు, సినిమా సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమయ్యారు (Celebrities in quarantine). మామూలుగానైతే ఎప్పుడు కొంచెం ఖాళీ సమయం దొరికినా.. విహార యాత్రలకో లేక వీధుల్లోనో షికార్లు కొట్టే వాళ్లు కానీ ఇప్పుడు యావత్ ప్రపంచం లాక్‌డౌన్ దశలో ఉండటంతో గడప దాటి ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోజుల తరబడి ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేయాలో అర్థం కాని సెలబ్రిటీలు.. క్వారంటైన్ పేరిట తమకు దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్లు ఉపయోగించుకుంటున్నారు. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంట (Virushka) కూడా క్వారంటైన్ పీరియడ్‌లో లభించిన ఖాళీ సమయాన్ని ఇలా సరదాగా కలిసి గడిపేస్తున్నారు. విరాట్ కోహ్లీకి (Virat Kohli) అనుష్క శర్మ (Anushka Sharma) స్వయంగా హెయిర్ స్టైలిస్ట్‌గా మారి హెయిర్ కట్ (Hair cut) చేసింది. ఆ వీడియోను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. కొన్ని క్షణాల్లోనే ఆ వీడియో వైరల్‌గా మారింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Meanwhile, in quarantine.. 💇🏻‍♂💁🏻‍♀

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

ఈ వీడియోలో విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ హెయిర్ కట్ చేయడం చూడొచ్చు. విరుష్క జంట క్వారంటైన్ సమయాన్ని ఇలా గడిపేస్తుండగా.. ఇంకొంత మంది దొరక్క దొరక్క దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కంటి నిండా కునుకు (Nap) తీస్తూ గడుపుతున్నారు. ఇంకొంత మంది జిమ్‌లో గంటల తరబడి చమటోడుస్తున్నారు (Workouts in Gym). ఇంకొంత మంది సెలబ్రిటీలు తమ పెంపుడు జంతువులతో కాలక్షేపం (Time pass with pets) చేస్తున్నారు. మరికొంత మంది సెలబ్రిటీలు స్వయంపాకంలో (Self cooking) బిజీ అయ్యారు.

Read also : Drinking sanitiser: ఆల్కహాల్ అనుకుని శానిటైజర్ తాగాడు

ఇవన్నీ ఎలా ఉన్నా.. ఇటీవల టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో మాత్రం నెటిజెన్స్‌ని నవ్వించింది. కోవిడ్ కారణంగా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న శిఖర్ ధావన్.. భార్య ఆయేషా ముఖర్జీ (Ayesha Mukherjee) ఆర్డర్స్ వేస్తోంటే... తాను బాత్రూమ్ క్లీన్ చేస్తూ, బట్టలు ఉతికేస్తున్నట్టుగా పోస్ట్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News