కోహ్లీకి ప్రపోజ్ చేసిన క్రికెటర్‌తో అర్జున్ లంచ్

శ్రీలంకతో అండర్‌-19 యూత్‌ టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ లండన్‌లో ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుతున్నాడు.

Updated: Aug 8, 2018, 01:04 PM IST
కోహ్లీకి ప్రపోజ్ చేసిన క్రికెటర్‌తో అర్జున్ లంచ్

శ్రీలంకతో అండర్‌-19 యూత్‌ టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ లండన్‌లో ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్‌ను కలిశాడు. తాజాగా ఆమెతో కలిసి రెస్టారెంట్ కి వెళ్లి  లంచ్ చేశాడు. ఈ సందర్భంగా వ్యాట్‌తో కలిసి అర్జున్ సెల్ఫీ దిగాడు. డేనియల్ ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కాగా ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఈ డేనియల్ గతంలో ‘కోహ్లీ నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని ట్వీట్‌ చేసి ప్రపోజ్ చేయగా.. దానికి తిరస్కరించిన కోహ్లీ.. గుర్తుగా ఓ బ్యాట్ ఇచ్చి పంపాడు. ఆ బ్యాట్‌తో మ్యాచ్ ఆడిన ప్రతీసారి కోహ్లీ పేరు చెప్పుకునే వ్యాట్..  ఇప్పుడు అర్జున్ టెండూల్కర్‌తో కలిసి తిరగడంపై సోషల్ మీడియాలో పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

ఇటీవల శ్రీలంకతో జరిగిన నాలుగు రోజుల అండర్19 టెస్ట్ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అర్జున్ అరంగేట్రం చేశాడు. ఈ ఎడమ చేతివాటం ఆల్‌రౌండర్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓ వికెట్ పడగొట్టి అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు.