ఆసియా కప్ 2018: భారత్-పాక్ మ్యాచ్ నేడు

క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓ ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

Last Updated : Sep 20, 2018, 04:44 PM IST
ఆసియా కప్ 2018: భారత్-పాక్ మ్యాచ్ నేడు

క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓ ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇవాళ (19-09-2018) ఆసియా కప్‌లో భాగంగా జరిగే గ్రూప్-ఎ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. చివరగా గత ఏడాది ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఈ రెండు జట్లు తలపడగా.. భారత్ ను ఓడించి కప్ సొంతం చేసుకుంది పాక్‌. దీంతో భారత్‌ ఈసారి పాక్‌ను ఓడించడానికి ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇక.. ఆసియా కప్‌లో భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ ఆరింటిలో, పాక్ ఐదింటిలో విజయం సాధించాయి. ఒకసారి ఫలితం తేలలేదు. ఆసియా కప్‌ను భారత్ 6 సార్లు (1983/84, 1988/89, 1990/91, 1994/95, 2010, 2016) నెగ్గగా, పాకిస్థాన్ కేవలం 2 సార్లు(2000, 2012) మాత్రమే కైవసం చేసుకుంది.

  • ఆసియాకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య నమోదైన అత్యధిక స్కోర్‌: 330
  • ఆసియా కప్‌ సందర్భంగా భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు: విరాట్‌ కోహ్లీ

భారత్ జట్టు (అంచనా)‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధవన్‌, రాయుడు, దినేశ్‌ కార్తీక్‌, ధోనీ, జాదవ్‌, పాండ్యా, కుల్దీప్‌, భువనేశ్వర్‌, బుమ్రా, చాహల్‌.
 

పాకిస్థాన్‌ జట్టు (అంచనా): ఇమామ్‌, ఫఖర్‌ జమాన్‌, బాబర్‌ ఆజమ్‌, షోయబ్‌, సర్ఫరాజ్‌ (కెప్టెన్‌), అసిఫ్‌ అలీ, షాదాబ్‌ ఖాన్‌, ఫహీమ్‌ ఆష్రఫ్‌, ఆమెర్‌, హసన్‌ అలీ, ఉస్మాన్‌ ఖాన్‌.

Trending News