బీసీసీఐకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లీగల్ నోటీసు

బీసీసీఐకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 70 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని కోరుతూ లీగల్ నోటీసు పంపించింది.

Last Updated : Dec 3, 2017, 07:44 PM IST
బీసీసీఐకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లీగల్ నోటీసు

బీసీసీఐకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 70 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని కోరుతూ లీగల్ నోటీసు పంపించింది. 2014, 2015 సంవత్సరాల్లో అగ్రిమెంట్ నియమాలను ఉల్లంఘించి, ఇరు దేశాల మధ్య జరగాల్సిన రెండు సిరీస్ మ్యాచ్‌లను భారత్ రద్దు చేసినందుకు నష్టపరిహారాన్ని కోరుతూ ఈ నోటీసులు పంపించింది. ఇటీవలే ఈ నోటీసులను బీసీసీఐతో పాటు ఒక కాపీని ఐసీసీ (ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్)కు కూడా పంపింది పీసీబీ. ఇలాంటి వివాదాలను పరిష్కరించడానికే ఐసీసీ ఆధ్వర్యంలో వివాదాల పరిష్కార వేదిక (డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీ) ఉంది.

గతంలో కూడా ఈ నోటీసులను బీసీసీఐకి పంపించామని.. అయితే ఆ సంస్థ ఏమీ పట్టించుకోనట్లు వ్యవహరించిందని పీసీబీ తన ఫిర్యాదులో పేర్కొంది. 2007 తర్వాత భారత్, పాకిస్తాన్‌తో ఎటువంటి ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లు కూడా ఆడలేదు. 2008లో ముంబయి దాడులు జరిగిన తర్వాత, భద్రతా కారణాల వల్ల పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ కూడా ఆడరాదని  బీసీసీఐ నిశ్చయించింది. 2014, 2015 సంవత్సరాల్లో ప్రత్యమ్నాయ వేదికలపై ఆడేందుకు ఇరు దేశాల జట్లు సిద్ధమైనప్పటికీ.. పలు కారణాల వల్ల భారత్ మళ్లీ ఆ ఆలోచనను విరమించుకుంది. అయితే బీసీసీఐ నిర్ణయం వల్ల తమకు ఆర్థికంగా ఎనలేని నష్టం వాటిల్లిందని.. అందుకు నష్టపరిహారం చెల్లించాలని పీసీబీ ఇప్పుడు డిమాండ్ చేస్తోంది

Trending News