Viral Video: ఈద్‌ వేడుకల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..!

CSK Eid Celebrations: దేశవ్యాప్తంగా ఈద్‌-ఉల్‌-ఫితుర్‌(రంజాన్‌)ను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఐపీఎల్‌ లో బిజీగా ఉన్న పలు జట్లు కూడా రంజాన్‌ వేడుకలను గ్రాండ్‌ గా జరుపుకున్నాయి.

Last Updated : May 3, 2022, 04:36 PM IST
  • ఈద్‌ వేడుకల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌
  • ఫ్యామిలీస్‌తో ఈద్‌ సెలబ్రేషన్స్‌
  • వెరైటీ ఫుడ్‌తో వింధు భోజనాలు
Viral Video: ఈద్‌ వేడుకల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..!

CSK Eid Celebrations: దేశవ్యాప్తంగా ఈద్‌-ఉల్‌-ఫితుర్‌(రంజాన్‌)ను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఐపీఎల్‌ లో బిజీగా ఉన్న పలు జట్లు కూడా రంజాన్‌ వేడుకలను గ్రాండ్‌ గా జరుపుకున్నాయి. ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సభ్యులు ఈద్‌ ఉల్‌ ఫితర్‌ ను ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు.  ఈ వేడుకల్లో ధోనీ, రాబిన్‌ ఊతప్ప, శివమ్‌ దూబే, బ్రావో, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీ, అంబటిరాయుడు పాల్గొన్నారు. పలువురు జట్టు సభ్యుల ఫ్యామిలీస్‌ కూడా ఈ సెలబ్రేషన్స్‌ లో పాలుపంచుకున్నాయి. 

 
వేడుకల్లో వింధు భోజనాలను ఏర్పాటుచేశారు. చెన్నై జట్టు సభ్యులు.. వెరైటీ ఫుడ్‌ లను ఆస్వాదించారు. పిల్లలతో కలిసి ఎంతో సరదాగా గడిపారు. ఈ వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు మేనేజ్‌ మెంట్‌ తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. ఈ వీడియోను నెటిజన్లు వైరల్‌ చేస్తున్నారు. ఐపీఎల్‌లో చెన్నైఇప్పటివరకు తొమ్మిది మ్యాచులు ఆడింది. ఇందులో తొలి నాలుగు మ్యాచుల్లోనూ చెన్నై టీం ఓటమిపాలైంది.  కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక రీసెంట్‌ గా సన్‌ రైజర్స్‌ జట్టుపై సాధించిన విజయంతో చెన్నై జట్టులో కొత్స ఉత్సాహం వచ్చింది. ధోనీ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఫస్ట్‌ మ్యాచ్‌ లోనే చెన్నై విజయం సాధించింది. రేపు ఆర్సీబీతో చెన్నై తన తదుపరి మ్యాచ్‌ ఆడనుంది.

 

Also Read: హృతిక్‌ రోషన్‌ చేసిన పనికి నా హృదయం ముక్కలైపోయింది.. స్టార్ హీరోయిన్ ఆవేదన!

Also Read: SVP Trailer: 'సర్కారు వారి పాట' ట్రైలర్‌నూ వాడేసిన హైదరాబాద్​ పోలీసులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News