Dinesh Karthik Runout Controversy: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై విజయంతో సెమీస్ బెర్త్‌ను దాదాపు కన్ఫార్మ్ చేసుకుంది టీమిండియా. వరుణుడు అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో బంగ్లాపై ఐదు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో దుమ్ములేపగా.. బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్, హర్దిక్ పాండ్యా అదరగొట్టారు. ఓపెనర్ లిటన్ దాస్ భయపెట్టినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. ఈ పరాజయంతో బంగ్లా సెమీస్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి.
ఇక ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ రనౌట్ అయిన విధానంపై అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సఫారీ మ్యాచ్ మధ్యలో గాయంతో మైదానాన్ని వీడిన కార్తీక్.. ఫిట్‌నెస్ సాధించడంతో బంగ్లాపై తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. హర్ధిక్ పాండ్యా అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కార్తీక్ ఓ బౌండరీ బాది ఊపులో ఉన్నట్లే కనిపించాడు.
అయితే 16వ చివరి బంతికి దురదృష్టవశాత్తూ అతను రనౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఎక్స్‌ట్రా కవర్ వైపు బంతిని కొట్టి.. రెండు అడుగులు ముందుకు వేశాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న దినేష్ కార్తీక్ రన్ కోసం వేగంగా పరిగెత్తాడు. అయితే కోహ్లీ వద్దు అని చెప్పి చేయి చూపించి.. వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో కార్తీక్ తిరిగి నాన్ స్ట్రైకర్ ఎండ్‌కు పరిగెత్తాడు. క్రీజ్‌లోకి డైవ్ చేసినా.. బౌలర్ షరీఫుల్ ఇస్లాం బంతిని అందుకుని వికెట్లను పడగొట్టాడు.
ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు నివేదించగా.. కొన్ని రీప్లేలను చూసిన తర్వాత కార్తీక్ ఔట్ అయినట్లు ప్రకటించారు. దీంతో కార్తీక్ 7 పరుగులకే నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీతో కాస్త వాదించాడు. నువ్వు పిలిస్తేనే రన్ కోసం వచ్చానని అన్నట్లు కార్తీక్ సైగ చేశాడు. కోహ్లీపై అసహనం వ్యక్తం చేస్తూ.. తల ఊపుతూ చిరాకుగా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. దీంతో విరాట్ కోహ్లీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Rohit Shamra: ఆ సమయంలో భయపడిన రోహిత్ శర్మ..? ఈ ముగ్గురు ప్లేయర్స్ మ్యాచ్ విన్నర్స్
Also Read: Munugodu Bypoll: తారాస్థాయికి చేరిన పంపకాలు, అర్ధరాత్రి రహస్యంగా నోట్ల కట్టలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి