స్పిన్ దిగ్గజం అనీల్ కుంబ్లేకు బర్త్ డే విషెస్

Last Updated : Oct 17, 2017, 07:57 PM IST
స్పిన్ దిగ్గజం అనీల్ కుంబ్లేకు బర్త్ డే విషెస్

భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్‌, కోచ్ అనీల్ కుంబ్లే ఈ రోజు 47వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు క్రికెటర్లతో పాటు పలువురు ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలిపారు.  ఈ సంద‌ర్భంగా జంబోకు..  సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ సహా పలువురు క్రికెటర్లు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు . స్పిన్ దిగ్గజం అనీల్ కుంబ్లేకు ట్విట్టర్ లో ఎవరెలా విష్ చేశారో చూడండి...

* ‘హ్యాపీ బర్త్‌ డే కుంబ్లే. నువ్వు ఎన్నో తరాలకు ఆదర్శవంతుడవు.’ - సచిన్‌ తెందుల్కర్‌

*  టీమిండియాలకు ధ‌నం లాంటి అనిల్ కుంబ్లే భాయ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. జై జై శివ్ శంభో... హ్యాపీ బ‌ర్త్‌డే జంబో`అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు

* ‘భారత్‌ సాధించిన అద్భుత విజయాలకు మూలకారకుల్లో ఒకడైన అనిల్‌ కుంబ్లేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.’ - వీవీఎస్‌ లక్ష్మణ్‌

* ‘హ్యాపీ బర్త్‌ డే అనిల్‌ భాయ్‌. నీ కలలన్ని నిజం కావాలని కోరుకుంటున్నా.’ - మహమ్మద్‌ కైఫ్‌

* ‘భారత్‌కు విజయాలు అందించిన వారిలో ఒకడైన కుంబ్లేకు హ్యాపీ బర్త్‌డే.’ - ఆకాశ్‌ చోప్రా

* ‘ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 956 వికెట్లతో మూడో స్థానంలో ఉన్న భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌కుంబ్లేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.’:  ఐసీసీ

* ‘ఈ రోజు శ్రీలంక మాజీ క్రికెటర్‌ అరవింద డిసిల్వా 52వ, కుంబ్లే 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ మ్యాచుల్లో 14 సార్లు డిసిల్వాను కుంబ్లేనే పెవిలియన్‌కు పంపాడు.’ : మోహన్‌దాస్‌ మీనన్‌

Trending News