T20 WC 2021 ENG Vs BAN: చెలరేగిన జేసన్‌ రాయ్‌...బంగ్లాపై ఇంగ్లాండ్ అలవోక విజయం

ENG Vs BAN:  ప్రపంచకప్‌లో భాగంగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 07:44 PM IST
  • బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్‌ గెలుపు
  • 8వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లీష్ టీమ్
  • రాణించిన జేసన్ రాయ్
T20 WC 2021 ENG Vs BAN: చెలరేగిన జేసన్‌ రాయ్‌...బంగ్లాపై ఇంగ్లాండ్ అలవోక విజయం

ENG Vs BAN:  టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2021)లో భాగంగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌(England) 8 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. జేసన్‌ రాయ్(Jason Roy) (61; 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డేవిడ్ మలన్‌ (28; 25 బంతుల్లో 3 ఫోర్లు) రాణించడంతో బంగ్లాదేశ్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలోనే ఇంగ్లాండ్‌ ఛేదించింది. 

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్ (Banglades) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ముష్ఫికర్‌ రహీమ్ (29) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన లిటన్‌ దాస్ (9), మహమ్మద్‌ నయీమ్‌ (5) విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన షకీబ్‌-అల్-హసన్‌ (4) కూడా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసేలోపే ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. చివర్లో నురుల్ హసన్‌ (16), నసూమ్‌ అహ్మద్‌ (19) ధాటిగా ఆడటంతో బంగ్లాదేశ్ ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో టైమల్‌ మిల్స్‌ మూడు, మొయిన్ అలీ రెండు, లివింగ్‌ స్టోన్ రెండు‌, క్రిస్‌ వోక్స్‌ ఒక వికెట్ తీశారు.

Also Read:T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ దిశగా పాకిస్తాన్, 4 పాయింట్లతో అగ్రస్థానం

బంగ్లా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలో ఓపెనర్ జోస్ బట్లర్ (18) రూపంలో షాక్‌ తగిలింది. ఐదో ఓవర్‌లో అతడు వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్‌ రాయ్‌ క్రీజులో కుదురుకోవడం, మలన్‌ అతడికి తోడవ్వడం విజయం కోసం ఆ జట్టు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇస్లామ్‌ వేసిన 13వ ఓవర్లో రాయ్‌ ఔటైనప్పటికీ  ఆ తర్వాత వచ్చిన బెయిర్‌స్టో (8)తో కలిసి మలన్‌ జట్టుకు విజయాన్ని అందించాడు. బంగ్లా బౌలర్లలో ఇస్లామ్‌, నసూమ్‌ తలో వికెట్ తీశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

Trending News