Hardik Pandya: ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సర్‌ప్రైజ్‌కు సిద్ఘంగా ఉండమంటున్నాడు. మరోవైపు జట్టు విజయానికి సంబంధించి కీలకమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
ఐపీఎల్ 2022 మరి కొద్దిరోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈసారి గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఎంట్రీ ఇస్తున్నాయి. లోగో విడుదల, జెర్సీ విడుదల అంటూ గుజరాత్ టైటాన్స్ కాస్త ఎక్కువే సందడి చేస్తోంది. అటు ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇప్పుడు కొత్తగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఐపీఎల్ 2022 లో కొత్తగా ప్రవేశిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టు జెర్సీ విడుదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్డేడియంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా, బీసీసీఐ కార్యదర్శి జై షాలు జెర్సీ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐపీఎల్‌లో కొత్తగా ఈసారి ఎంట్రీ ఇస్తున్న గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య తొలిమ్యాచ్..మార్చ్ 28వ తేదీన జరగనుంది. జెర్సీ ఆవిష్కరణ సందర్బంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీడియాతో మాట్లాడాడు. బౌలింగ్ చేస్తారా లేదా అనే ప్రశ్నకు..అది మాత్రం సర్‌ప్రైజ్ ..అలాగే ఉండనివ్వండంటూ తెలివిగా సమాధానమిచ్చాడు. విజయాలు జట్టువి..అపజయాలు తనవని హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు. జట్టులోని ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా వారిలోని ప్రతిభను ఉపయోగించుకోవడమే తన లక్ష్యమని..ఈ వ్యవహారంలో పూర్తి స్పష్టత, నిజాయితీ తనకుందన్నాడు. అంతా బాగుందనుకున్నప్పుడు ఆటగాళ్లకు తమ మద్దతు అవసరం లేదని చెప్పాడు. ఎప్పుడూ కష్ట సమయాల్లో వెన్నంటి ప్రోత్సహిస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నాడు. ఆటగాళ్ల ప్రతిభను వినియోగించుకోవడమనేది పూర్తిగా కెప్టెన్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పాడు.
హార్దిక్ పాండ్యా కాస్త ప్రో యాక్టివ్ కాబట్టే..గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఇతడిని గుజరాత్ టైటాన్స్ 15 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది.
Also read: Virat Kohli: పోలీసులకి చుక్కలు చూపించి మరీ.. విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగిన ఫాన్స్! చివరకు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook