వరల్డ్ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

Last Updated : May 2, 2018, 08:03 AM IST
వరల్డ్ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 125 రేటింగ్ పాయింట్లతో మొదటిస్థానంలో నిలిచింది. ఇక 112 పాయింట్లతో సౌతాఫ్రికా రెండవ స్థానంలో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. టీమ్ ర్యాంకింగ్స్‌ ప్రకటించే సమయానికి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 13 పాయింట్ల తేడా ఉంది. భారత జట్టును క్రాస్ చేయాలంటే సౌతాఫ్రికాకు తప్ప మిగిలి జట్లకు అది భారమే. 2015-16, 2016-17 సీజన్లలో జట్ల ఫలితాల్లో 50శాతాన్ని పరిగణనలోకి తీసుకొని.. తాజాగా ఈ ర్యాంకులను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. కొహ్లి నాయకత్వంలోని భారత జట్టు ఫార్మాట్ తో సంబంధం లేకుండా గత కొంతకాలంగా విజయాలతో దూసుకుపోతున్న  సంగతి తెలిసిందే.

ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్(మే1, 2018 ప్రకారం)

1. ఇండియా - 125 పాయింట్లు (+4 పాయింట్లు)
2. దక్షిణాఫ్రికా - 112 పాయింట్లు (-5 పాయింట్లు)
3. ఆస్ట్రేలియా - 106 పాయింట్లు (+4 పాయింట్లు)
4. న్యూజిలాండ్ - 102 పాయింట్లు
5. ఇంగ్లాండ్ - 98 పాయింట్లు (+1 పాయింట్)
6. శ్రీలంక - 94 పాయింట్లు (-1 పాయింట్)
7. పాకిస్తాన్ - 86 పాయింట్లు (-2 పాయింట్లు)
8. బంగ్లాదేశ్ - 75 పాయింట్లు  (+4 పాయింట్లు)
9. విండీస్ - 67 పాయింట్లు (-5 పాయింట్లు)
10. జింబాబ్వే - 2 పాయింట్లు(+1 పాయింట్)

More Stories

Trending News