IND Vs AUS: విశాఖ వేదికగా రెండో వన్డే.. హిట్‌మ్యాన్ వచ్చేశాడు.. యంగ్ ప్లేయర్‌పై వేటు

Ind Vs Aus 2nd Odi Match Preview: తొలి వన్డేలో విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలోనూ గెలుపొంది సిరీస్‌ను పట్టేయాలన చూస్తోంది. విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ తిరిగి జట్టుతో చేరాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2023, 08:00 AM IST
  • నేడు భారత్-ఆసీస్ మధ్య రెండో వన్డే
  • మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
  • \తుది జట్లు ఇలా..
IND Vs AUS: విశాఖ వేదికగా రెండో వన్డే.. హిట్‌మ్యాన్ వచ్చేశాడు.. యంగ్ ప్లేయర్‌పై వేటు

Ind Vs Aus 2nd Odi Match Preview: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరగనుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తన బావా పెళ్లి కారణంగా మొదటి వన్డేకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వన్డేకు అందుబాటులో ఉన్నాడు. విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రెండో వన్డే ప్రారంభం కానుంది. వర్షం ముప్పు పొంచిన ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఆట కొనసాగుతుందో లేదో అనుమానం కలుగుతోంది. అచ్చొచ్చిన మైదానంలో విజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని భారత్ చూస్తుండగా.. ఈ వన్డేలో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆసీస్ చూస్తోంది. రెండు జట్లు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

రెండో వన్డేకు కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడంతో ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. గత మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమవ్వడం భారత్ శిబిరంలో ఆందోళనకు గురిచేసింది. గిల్‌, రోహిత్‌తోపాటు విరాట్ కోహ్లీ కూడా బ్యాట్‌కు పనిచెప్పాల్సి ఉంది. సూర్య కుమార్ యాదవ్ వన్డేల్లో సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది. శ్రేయాస్ అయ్యర్ దూరమవ్వడంతో తుది జట్టులో సూర్యకు చోటు దక్కుతోంది. సూర్య ఓ భారీ ఇన్నింగ్స్ ఆడితే.. ప్లేస్ ఫిక్స్ అయిపోతుంది. 

తొలి వన్డేలో అదరగొట్టిన కేఎల్ రాహుల్ ఐదోస్థానంలోనే బ్యాటింగ్ చేయనున్నాడు. గత మ్యాచ్‌లో కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాహుల్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. మరోసారి అలాంటి ఇన్నింగ్స్ ఆడితే అతనికి తిరుగుండదు. వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే జడేజా కూడా అదరగొట్టాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో దుమ్ములేపాడు. హర్ధిక్ పాండ్యా మరోసారి కీలకం కానున్నాడు. బౌలర్లు మహ్మద్ షమీ, సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. శార్దుల్ ఠాకూర్ కూడా రాణించాల్సిన అవసరం ఉంది. విశాఖలో కుల్దీప్ యాదవ్ ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. 

రెండో వన్డేకు ఆస్ట్రేలియా కూడా ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి వన్డేకు డేవిడ్ వార్నర్ ఫిట్‌గా లేకపోవడంతో అతని స్థానంలో ట్రావిస్ హెడ్‌ను ఆడించింది. రెండో మ్యాచ్‌కు వార్నర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మార్ష్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. తొలి వన్డేలో బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టును దెబ్బ తీసింది. బౌలింగ్‌లో రాణించినా తక్కువ స్కోరు కావడంతో కాపాడలేకపోయారు. రెండో వన్డేకు బ్యాట్స్‌మెన్ పుంజుకోవాల్సి ఉంది.

రెండో మ్యాచ్‌కు తుది జట్లు ఇలా (అంచనా):

భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ/జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ఆడమ్ జంపా, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్

Also Read: New Pay Scale: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెరవేరిన 23 ఏళ్ల కల.. కొత్త పే స్కేలు వర్తింపు  

Also Read: New Income Tax Rules 2023: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. తప్పకుండా తెలుసుకోండి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News