India Vs Nepal Toss Update and Playing 11: పసికూన నేపాల్‌తో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సూపర్-4లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. అటు నేపాల్ కూడా భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో నేపాల్ టీమ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమవ్వడంతో మహ్మాద్ షమీ తుది జట్టులోకి వచ్చాడు. నేపాల్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది.
"మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇందుకు ప్రత్యేక కారణం లేదు. చివరి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేశాం. బౌలర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. వాతావరణం గురించి పెద్దగా ఐడియా లేదు. పరిస్థితులు తగ్గుట్లు బౌలింగ్ చేయాలని ఆశిస్తున్నాం. గత మ్యాచ్‌లో మేము ఒత్తిడిలో బ్యాటింగ్ చేశాం. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇషాన్ చాలా పరిణతి కనబరిచి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఇది మాకు మంచి సంకేతాలు. ఇది మాకు మరో ముఖ్యమైన మ్యాచ్. బుమ్రా అందుబాటులో లేడు. షమీని తుది జట్టులోకి తీసుకున్నాము.." అని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
"ఓవర్ హెడ్ పరిస్థితుల కారణంగా మేం కూడా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. నేపాల్ క్రికెట్‌కు ఈరోజు అతిపెద్ద రోజు. మాకు గొప్ప అవకాశం. ఆరిఫ్ షేక్ స్థానంలో భీమ్ షార్కి జట్టులోకి వచ్చాడు.." అని నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ తెలిపాడు.
తుది జట్లు ఇలా..
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
నేపాల్: కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ (వికెట్ కీపర్), రోహిత్ పౌడెల్ (కెప్టెన్), భీమ్ షర్కి, సోంపాల్ కమీ, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ మల్లా, సందీప్ లామిచానే, కరణ్ ఛెత్రి, లలిత్ రాజ్‌బన్షి.
Also Read: Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ 'డెవిల్' మూవీ కోసం భారీ సెట్స్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా..!
Also Read: Jasprit Bumrah Blessed With Baby Boy: తండ్రైన బుమ్రా.. కుమారుడికి డిఫరెంట్ పేరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి