IND vs SA 3rd Test Day 1: ముగిసిన మొదటి రోజు ఆట.. భారత బౌలర్ల విజృంభన

IND vs SA 3rd Test Day 1 Highlights: టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌ తొలి రోజు ఆట ముగిసి సమయానికి.. సౌత్‌ఆఫ్రికా వికెట్‌ నష్టానికి 17 పరుగులు (8 ఓవర్లు) చేసింది. డీన్‌ ఎల్గర్‌ (3) త్వరగా పెవిలియన్‌కు చేరాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2022, 11:27 PM IST
  • బౌలింగ్‌తో విజృంభించిన బుమ్రా
  • దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్ ఔట్
  • 206 పరుగులు వెనుకబడి ఉన్న దక్షిణాఫ్రికా
IND vs SA 3rd Test Day 1: ముగిసిన మొదటి రోజు ఆట.. భారత బౌలర్ల విజృంభన

IND vs SA 3rd Test Day 1 Highlights, Bumrah removes Elgar, South Africa 17/1 At Stumps : టీమిండియా, దక్షిణాఫ్రికా (South Africa) జట్ల మధ్య జరుగుతోన్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌ మొదటి రోజు ఆట ముగిసింది. మూడో టెస్ట్ మ్యాచ్‌ తొలి రోజున (IND vs SA Highlights, 3rd Test Day 1) భారత్ బౌలర్లు విజృంభించారు. ఆట ముగిసే సమయానికి సౌత్‌ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 17 పరుగులు (8 ఓవర్లు) చేసింది. క్రీజ్‌లో మార్‌క్రమ్ (8), మహరాజ్‌ (6) ఉన్నారు. 

ఓపెనర్‌, దక్షిణాఫ్రికా జట్టు సారథి డీన్‌ ఎల్గర్‌ (3) (Elgar) త్వరగా పెవిలియన్‌కు చేరాడు. బుమ్రా (Jaspirt Bumrah) ఈ వికెట్ తీశాడు. బుమ్రా (Bumrah)నాలుగు ఓవర్లు వేయగా.. నాలుగింటిని మెయిడిన్‌ చేశాడు. ఇక అంతకుముందు టీమిండియా 223 పరుగులకు ఆలౌట్‌ అయింది. సఫారీల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులు (206 runs) వెనుకబడి ఉంది.

దక్షిణాఫ్రికా బౌలర్స్‌ రబాడ (4/73), జాన్‌సెన్ (3/55) విజృంభించారు. అయితే కెప్టెన్‌ కోహ్లి (Virat Kohli) (201 బంతుల్లో 79 రన్స్, 12 ఫోర్లు, సిక్స్‌) ఒంటరి పోరు చేశారు. దీంతో భారత్‌ ఈ మాత్రం స్కోర్ చేయగలిగింది. కోహ్లి (Kohli) ఈ మ్యాచ్‌లో సెంచరీ మార్క్‌ను అందుకుంటారని అందరూ అనుకున్నారు. 33 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్‌లోకి వచ్చాడు కోహ్లి. అయితే 211 రన్స్ వద్ద తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. .

Also Read : IPL New Sponsor: ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్.. తప్పుకున్న వివో!

ఇక పుజారా (43), (Cheteshwar Pujara) రిషభ్‌ పంత్‌ (27), (Rishabh Pant) కేఎల్‌ రాహుల్‌ 12, మయాంక్‌ అగర్వాల్ 15, రహానె 9, అశ్విన్‌ 2, ఠాకూర్‌ 12, షమీ 7, ఉమేశ్‌ 4 పరుగులు చేశారు. రబాడ 4, జాన్‌సెన్ 3, ఒలివియర్‌, ఎంగిడి, మహరాజ్‌ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

Also Read : Chris Morris: రాజస్థాన్ కు షాకిచ్చిన క్రిస్ మోరిస్... రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా ఆటగాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News