India vs South Africa 1st Test, Day 3: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ (India vs South Africa 1st Test) పట్టుబిగిస్తోంది. షమి (Mohammed Shami) దెబ్బకు అతిథ్య జట్టు 197 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ కు 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మయాంక్ వికెట్‌ను కోల్పోయి 16 పరుగులు చేసింది. రాహుల్ (5)కు తోడుగా నైట్‌వాచ్‌మన్ శార్దూల్ ఠాకూర్ (4) క్రీజులో ఉన్నాడు.
మంగళవారం 272/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి 327 పరుగులకే ఆలౌటైంది. సెంచరీ హీరో రాహుల్ (123) ఒక్క పరుగు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. వర్షం వల్ల ఏర్పడ్డ తేమను సద్వినియోగం చేసుకున్న ఎంగిడి (6/71) (Lungi Ngidi) భారత జట్టు పతనాన్ని శాసించాడు. రబాడ (3/72) అతడికి సహకారాన్నిచ్చాడు.
Also Read: IND Vs SA, 1st Test Day 1: సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్...టీమ్‌ఇండియాదే ఆధిక్యం..
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు (South Africa) తొలి ఓవర్లలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఎల్గర్ (1)ను బుమ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాత షమి జోరు మొదలైంది. లంచ్ తర్వాత అతడు ఓ చక్కని ఇన్ కటర్‌తో కీగన్ పీటర్సన్ (15)ను బౌల్డ్ చేశాడు. బుమ్రాకు (Jasprit Bumrah) గాయం కావడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయినా ఏ మాత్రం తగ్గని షమీ.. మరో ఓపెనర్ మార్‌క్రమ్ (13)ను పెవిలియన్ కు పంపించాడు. తర్వాతి ఓవర్లోనే డసెన్ (3)ను సిరాజ్ ఔట్ చేశాడు. తర్వాత బపుమా, డికాక్ నిలకడగా ఆడుతూ..72 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. శార్దూల్ డికాక్ ను (Quinton de Kock) ఔట్ చేయడంతో..టీ విరామానికి 5 వికెట్లు నష్టానికి 109 పరులు చేసింది సౌతాఫ్రికా. ఆఫ్ సెంచరీ చేసిన బపుమాను షమీ ఔట్ చేశాడు. అనంతరం టెయిలెండర్ల రాణించటంతో..అతిథ్య జట్టు 197 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook