IPL 2020: Corona Effect.. ఐపీఎల్ నూ వదలదా?

ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా కార్యక్రమాలు రద్దు చేయబడగా, మరికొన్ని వాయిదా వేయబడ్డాయి. కాగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్, ఈ ఏడాది చివర్లో జూలై-ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌జరగడంపై కూడా తీవ్ర అనుమానాలు, బెదిరింపులు వస్తున్నా

Last Updated : Mar 6, 2020, 06:20 PM IST
IPL 2020: Corona Effect.. ఐపీఎల్ నూ వదలదా?

ముంబై: ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా కార్యక్రమాలు రద్దు చేయబడగా, మరికొన్ని వాయిదా వేయబడ్డాయి. కాగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్, ఈ ఏడాది చివర్లో జూలై-ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌జరగడంపై కూడా తీవ్ర అనుమానాలు, బెదిరింపులు వస్తున్నా నేపథ్యంలో ఇప్పటికే భారతదేశాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న కరోనావైరస్ వ్యాప్తి రాబోయే ఐపీఎల్ సీజన్ దీని బారి నుండి ఎలా బయటపడుతుందోనని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మార్చి 29 నుండి ప్రారంభమయ్యే టోర్నమెంట్ సజావుగా నిర్వహించడానికి బోర్డు అన్ని ప్రయత్నాలు చేస్తోందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. 

ప్రభుత్వం జారీ చేసిన ముందుజాగ్రత్త మార్గదర్శకాలను బోర్డు అనుసరిస్తుందని, ఆటగాళ్ళు, ఫ్రాంచైజీలు, విమానయాన సంస్థలు, ఆటగాళ్లు బస చేసే హోటళ్ళు, సిబ్బంది ప్రతి ఒక్కరికి సూచనలు పంపుతుందని బీసీసీఐ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఆటగాళ్లు అభిమానులతో కరచాలనం చేయవద్దని మొబైల్ ఫోన్లతో చిత్రాలు తీయవద్దని బోర్డు ఆటగాళ్లకు సలహా ఇంచిందని తెలిపారు. 

ఐపీఎల్-2020 ఓపెనింగ్ మ్యాచ్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో మార్చి 29 న వాంఖడే స్టేడియంలో తలపడనుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News