IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ ముగిసింది. ఏ జట్టు ఆటగాళ్లు ఎవరనేది తేలిపోయింది. ఐపీఎల్లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఖరారైంది. ఆ జట్టు ఆటగాళ్లెవరంటే..
బెంగళూరు వేదికగా ఈనెల 12, 13 తేదీల్లో జరిగిన మెగా ఆక్షన్ దిగ్విజయంగా ముగిసింది. అంచనాలున్న కొంతమంది ఆటగాళ్లకు అద్భుతమైన ధర పలకగా, మరి కొంతమందికి నిరాశే ఎదురైంది. ఇంకొద్దిమందికి మాత్రం అసలు అవకాశమే దక్కలేదు. ఈసారి ఐపీఎల్లో కొత్తగా గుజరాత్ టైకూన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఎంట్రీ ఇస్తున్నాయి. కేఎల్ రాహుల్ నేతృత్వంలో సిద్ధమైన లక్నో సూపర్ జెయింట్స్ 21 మంది ఆటగాళ్లతో సమరానికి సిద్దమైంది. లక్నో జట్టు ఏ ఆటగాళ్లను చేర్చుకుంది, ఎంత ఖర్చు చేసిందనే వివరాలు పరిశీలిద్దాం.
ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ (IPL 2022 Mega Auction)సరికొత్త నిర్వచనాలు సృష్టించింది. సురేష్ రైనా, ఇషాంత్ శర్మ, గప్టిల్ వంటి కీలకమైన ప్లేయర్లకు నిరాశ మిగిల్చింది. డేవిడ్ వార్నర్ వంటి విధ్వంసక ప్లేయర్లకు ఆశించిన ధర ఇవ్వలేదు. అదే సమయంలో యువ ఆటగాళ్లకు, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని టిమ్ డేవిడ్, షారుఖ్ ఖాన్, అవేశ్ ఖాన్ వంటి ఆటగాళ్లకు భారీ ధర లభించింది. వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా ఇషాన్ కిషన్ నిలబడ్డాడు. ఐపీఎల్లో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌పై అందరి దృష్టీ పడింది. 21 మంది ఆటగాళ్లను సిద్దం చేసుకున్న జట్టు..యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో సవాల్ విసురుతోంది. 59 కోట్ల మూలధనంతో వేలంలో ఎంట్రీ ఇచ్చిన లక్నో జట్టు తొలిరోజే దూకుడుగా వ్యవహరించి..52 కోట్లతో కీలక ఆటగాళ్లను చేజిక్కించుకుంది. ఆ తరువాత రెండవరోజు ఇంకొంతమంది ఆటగాళ్లను వేలంలో దక్కించుకుంది.
వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకున్న ఆటగాళ్లు
అవేశ్ ఖాన్ 10 కోట్లు
జాసన్ హోల్డర్ 8.75 కోట్లు
కృనాల్ పాండ్యా 8.25 కోట్లు
ఎవిస్ లూయిస్ 2 కోట్లు
మార్క్‌వుడ్ 7.50 కోట్లు
క్వింటన్ డి కాక్ 6.75 కోట్లు
మనీష్ పాండే 4.60 కోట్లు
దీపక్ హుడా 5.75 కోట్లు
దుష్మంత్ చమేరా 2 కోట్లు
కృష్ణప్ప గౌతమ్ 90 లక్షలు
మయాంక్ యాదవ్ 20 లక్షలు
కైల్ మేయర్స్ 50 లక్షలు
కరణ్ శర్మ 20 లక్షలు
ఆయుష్ బడోని 20 లక్షలు
మొహ్సిన్ ఖాన్ 20 లక్షలు
మనన్ వోహ్రా 20 లక్షలు
షాబాజ్ నదీమ్ 50 లక్షలు
అంకిత్ రాజ్‌పుత్ 50 లక్షలు
వేలం కంటే ముందే కేఎల్ రాహుల్‌ను ( KL Rahul)17 కోట్లకు, మార్కస్ స్టోయినిస్‌ను 9.20 కోట్లకు, రవి బిష్ణోయ్‌ను 4 కోట్లకు లక్నో జట్టు రిటైన్ చేసుకుంది.
Also read: SRH Full Squad: ముగిసిన ఐపీఎల్ 2022 వేలం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే! ఈసారైనా..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook