IPL 2022: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త, వచ్చే ఐపీఎల్‌లో మరో 2 కొత్త జట్లు

IPL 2022 Two New IPL Teams To Be Auctioned In May, 2021: వచ్చే సీజన్ నుంచి మీకు మరింత వినోదం పంచేందుకు ఐపీఎల్ సిద్ధం కానుంది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న కొత్త జట్లపై నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ బరిలో 10 జట్లు చూడబోతున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 14, 2021, 04:57 PM IST
  • వచ్చే సీజన్ నుంచి మీకు మరింత వినోదం పంచేందుకు ఐపీఎల్ సిద్ధం కానుంది
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ నుంచి 10 జట్లు బరిలోకి దిగనున్నాయి
  • ఈ ఏడాది మే నెలలో కొత్త జట్లను ఖరారు చేయనున్న బీసీసీఐ, ఐపీఎల్ పెద్దలు
IPL 2022: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త, వచ్చే ఐపీఎల్‌లో మరో 2 కొత్త జట్లు

IPL 2022 Latest News | క్రికెట్ ప్రేమికులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వాహక మండలి, బీసీసీఐ శుభవార్త చెప్పింది. వచ్చే సీజన్ నుంచి మీకు మరింత వినోదం పంచేందుకు ఐపీఎల్ సిద్ధం కానుంది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న కొత్త జట్లపై నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ బరిలో 10 జట్లు చూడబోతున్నారు.

భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, మరికొందరు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించి శనివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ 2022(IPL 2022)లో 10 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ ఏడాది మే చివరికల్లా మరో రెండు కొత్త ఫ్రాంచైజీలు ఖరారు చేయనున్నామని బీసీసీ అధికారి తాజా అప్‌డేట్స్‌ను పీటీఐకి వెల్లడించారు. 

Also Read: Virat Kohli DucK Out: విరాట్ కోహ్లీ డకౌట్ అయితే చాలా సంతోషించాను, బౌలర్లు కోరుకునేది ఇదేనట

బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీలపై కసరత్తు మొదలుపెట్టింది. జట్లు ఖరారు అయిన తరువాత బీసీసీఐ అధికారికంగా వెల్లడించనుందని ఆ అధికారి పేర్కొన్నారు. మరోవైపు ఇంగ్లాండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)గానీ, లేక వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకుగానీ విశ్రాంతి ఇవ్వనున్నారు. యువ ఓపెనర్లు పృథ్వీ షాగానీ, దేవదత్ పడిక్కల్ గానీ ఎంపిక కాలేదు. 

Also Read: Mithali Raj Record: తెలుగు తేజం మిథాలీరాజ్ అద్భుతం, టీమిండియా తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు 

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌కు మహిళా జట్టు
50 ఓవర్ల ప్రపంచ కప్‌ ముందు భారత మహిళా జట్టు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది, తరువాత వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్‌లో ఒక సన్నాహక సిరీస్ ఉంటుంది. మహిళల క్రికెట్, పురుషుల ఆటకు చాలా భిన్నమైనది. మేము ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాము, 6 సంవత్సరాలలో ఇదే మాకు మొదటిది అని టీమ్ తెలిపింది. వచ్చే ఏడాది U19 ప్రపంచ కప్‌కు సన్నామక టోర్నమెంట్‌గా వ్యవహరించే వినూ మన్కడ్ 50 ఓవర్ల టోర్నమెంట్ నిర్వహించనున్నారు.

Also Read: IPL 2021 Schedule: ఐపీఎల్ 2021 పూర్తి షెడ్యూల్, వేదికల వివరాలు విడుదల చేసిన BCCI

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News