Sanjay Manjrekar feels Mumbai Indians eye on Adil Rashid or Adam Zampa in IPL 2023 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 మినీ వేలానికి రంగం సిద్దమైంది. కేరళలోని కొచ్చి వేదికగా డిసెంబర్ 23న మినీ వేలం జరగనుంది. 991 మంది ప్లేయర్స్ ఈ మినీ వేలానికి రిజిస్టర్ చేసుకోగా.. 10 ఫ్రాంచైజీలు 405 మంది ఆటగాళ్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేశాయి. ఐపీఎల్ 2023 మినీ వేలంలో గరిష్టంగా 87 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. 87 మందిలో 30 స్లాట్స్ ఓవర్సీస్ ఆటగాళ్లకు ఉండగా.. మరో 57 స్థానాలు భారత ఆటగాళ్లకు ఉన్నాయి.
ఐపీఎల్ 2023 మినీ వేలానికి సమయం దగ్గరపడుతుండడంతో ఫ్రాంచైజీల వ్యూహాలు రచిస్తునాయి. అదే సమయంలో టీమ్స్ కొనుగోలు చేసే ఆటగాళ్ల ప్రిడిక్షన్స్ జోరు అందుకున్నాయి. వేలానికి ముందు చాలా మందిని వదిలేసిన ముంబై ఇండియన్స్.. సరైన ఆటగాళ్ల కోసం చూస్తోంది. సరైన బౌలింగ్ దాడి లేకపోవడంతో గతేడాది ప్లే ఆప్స్ చేరని ముంబై.. ఈసారి ఆ విభాగంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా స్పిన్ బౌలర్లను జట్టులోకి తీసుకునేందుకు ప్లాన్ వేసిందని సమాచారం. వేలం నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు.
2023 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ బౌలర్లపైనే ప్రధానంగా దృష్టి పెడుతుందని సంజయ్ మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. రషీద్ ఖాన్, సునీల్ నరైన్ వంటి బౌలర్ల కోసం ఎదురు చూస్తుందని చెప్పాడు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ... '2022 సీజన్లో సరైన బౌలింగ్ దాడి లేకపోవడంతో ముంబై ఇండియన్స్ చాలా ఇబ్బంది పడింది. ఈసారి జస్ప్రీత్ బుమ్రాతో పాటు జొఫ్రా ఆర్చర్ కూడా జట్టులోకి వస్తారు. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ కూడా ఉండటంతో పేస్ బౌలింగ్ పటిష్టంగా మారుతుంది' అని అన్నాడు.
'రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడుతున్నాడు. అయితే ప్రతీ ఫ్రాంచైజీ కూడా రషీద్ ఖాన్ లాంటి లెగ్ స్పిన్నర్‌ను తీసుకోవడానికి మొగ్గు చూపుతోంది. కాబట్టి ముంబై ఇండియన్స్ కూడా ఇలానే ఆలోచిస్తుంది. ముంబై జట్టులో మయాంక్ మార్కండే ఉన్నప్పటికీ.. ఆడమ్ జంపా, అదిల్ రషీద్ వంటి అంతర్జాతీయ స్పిన్నర్‌ను తీసుకోవడానికి ముంబై ప్రయత్నించవచ్చు. ఇద్దరిలో ఒక్కరు జట్టులోకి వచ్చినా బాగుంటుంది. లేదంటే కష్టమే' అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.
Also Read: పెట్రోల్, గ్యాస్ కాకుండా.. నీటితో నడుస్తున్న బైక్! నమ్మకుంటే ఈ వీడియో చూడండి
Also Read: Venus Transit 2023: మాలవ్య రాజ్యయోగం.. కొత్త సంవత్సరంలో ఈ 3 రాశుల వారు పట్టుకున్న ప్రతీది బంగారమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.