Hardik Pandya: ట్రెడింగ్‌లో బిగ్‌ ట్విస్ట్.. ముంబై ఇండియన్స్‌కు హార్ధిక్ పాండ్యా.. కన్ఫార్మ్..!

Hardik Pandya Traded to Mumbai Indians: గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రెడింగ్‌లో తీసుకున్నట్లు క్రిక్‌ బజ్ ప్రకటించింది. రెండు ఫ్రాంచైజీలు ఈ మేరకు సంతకాలు చేశాయని ధృవీకరించింది. అయితే కాసేపటి క్రితం గుజరాత్ ప్రటించిన టీమ్‌లో పాండ్యా పేరు ఉన్న విషయం తెలిసిందే.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 26, 2023, 08:16 PM IST
Hardik Pandya: ట్రెడింగ్‌లో బిగ్‌ ట్విస్ట్.. ముంబై ఇండియన్స్‌కు హార్ధిక్ పాండ్యా.. కన్ఫార్మ్..!

Hardik Pandya Traded to Mumbai Indians: ఐపీఎల్ 2024 వేలానికి ముందు బిగ్‌ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ ట్రేడింగ్‌లో తీసుకున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. "హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు బదిలీ అయ్యాడు. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. గతంలో నివేదించినట్లుగా ఇది భారీ మొత్తం డీల్ కాబట్టి ఏ ఆటగాడు అయినా వేరే నిర్ణయం తీసుకోడు.." అంటూ క్రిక్ బజ్ రాసుకోచ్చింది. కాగా.. కాసేపటి క్రితం గుజరాత్ టైటాన్స్ ప్రకటించిన టీమ్‌లో హార్ధిక్ పాండ్యా పేరు కూడా ఉంది. తమతోనే ఉన్నట్లు గుజరాత్ ప్రకటించింది. అయితే ఈలోపు మళ్లీ క్రిక్‌బజ్ ఇలా రాయడంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు. అసలు ఏం జరుగుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

బీసీసీఐ, ఐపీఎల్ నుంచి ఈ డీల్‌కు ఆమోదం తెలిపినట్లు తెలిసిందని క్రిక్‌బజ్ పేర్కొంది. అయితే ఎంత డీల్ అనేది స్పష్టం తెలియరాలేదని తెలిపింది. గుజరాత్ టైటాన్స్‌ జట్టు హార్ధిక్ పాండ్యాను వేలంలో ర.15 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 2022 సీజన్‌లో జట్టుకు టైటిల్ అందించిన పాండ్యా.. 2023లో రన్నరప్‌గా నిలిపాడు. అలాంటి ప్లేయర్‌ను గుజరాత్ వదులుకోదని ముందు నుంచి అందరూ అనుకుంటుండగా.. తాజాగా క్రిక్‌బజ్ మాత్రం డీల్ ఒకే అయిందని.. అధికారిక ప్రకటన రానుందని కన్ఫార్మ్ చేసింది.

 

అంతకుముందు ప్రకటించిన గుజరాత్ టైటాన్స్ టీమ్ ఇలా..

డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, బి.సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహ్మద్ షమీ, ఆర్ అహ్మద్, ఆర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోష్ లిటిల్, మోహిత్ శర్మ

విడుదలైన ప్లేయర్లు: యష్ దయాల్, KS భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సాంగ్వాన్, ఒడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, దసున్ షనక. (ఇందులో హార్ధిక్ పాండ్యా పేరును చేర్చలేదు.)

ముంబై ఇండియన్స్ టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, క్యామ్ గ్రీన్, షామ్స్ ములానీ, నెహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జాసన్ బెహ్రెండోర్ఫ్, రొమారియో షెపర్డ్ 

రిలీజ్ అయిన ప్లేయర్లు: అర్షద్ ఖాన్, రమణదీప్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, డువాన్ జాన్సెన్.

Also Read: IPL 2024 Trading Window Live Updates: ఐపీఎల్‌ పూర్తి జట్ల వివరాలు ఇవే.. ఏ జట్టులో ఏ ప్లేయర్ అంటే..?

Also Read: విదేశీ పెళ్లిళ్లు వద్దు.. వరుణ్ తేజ్ పెళ్లిని ఉద్దేశించేనా..!?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News