BCCI Says Australia, England players available for entire IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 మినీ వేలం మరికొద్ది సేపట్లో కొచ్చిలోని బోల్‌గటీ ఐలాండ్‌లోని గ్రాండ్ హయత్ హోటల్‌లో ఆరంభం కానుంది. ఈ సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఫ్రాంఛైజీలకు గుడ్‌న్యూస్ అందించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్లేయర్స్ ఐపీఎల్ 2023కి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని చెప్పింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల క్రికెట్ బోర్డులు ధ్రువీకరించినట్లు పేర్కొంది. దాంతో మినీ వేలంలో పాల్గొనే 10 ప్రాంఛైజీలు ఆనందంలో ఉన్నాయి.
వచ్చే ఏడాది జూన్ నెలలో ప్రపంచ క్రికెట్‌లోనే ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ 2023 జరగనుంది. ఈ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్లేయర్లు ఐపీఎల్ 2023 ఆసాంతం ఆడతారా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఆందోళనలో ఉన్న ఫ్రాంచైజీలకు బీసీసీఐ కొద్దిసేపటి క్రితం గుడ్ న్యూస్ అందించింది. తమ ఆటగాళ్లు ఐపీఎల్ 2023కి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారని ఇరు జట్ల బోర్డులు ప్రకటించాయి. మార్చి 30 తర్వాత ఆసీస్, ఇంగ్లీష్ ప్లేయర్స్ భారత్ రానున్నారు.
ఐపీఎల్ వేలంలో హాట్ ఫేవరెట్‌గా భావిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పండగ చేసుకోనున్నాడు. అన్ని ప్రాంఛైజీలు అతడి కోసం పోటీ పడే అవకాశం ఉంది. దాంతో 10-15 కోట్ల ధరకు స్టోక్స్ అమ్ముడుపోవచ్చు. అలానే ఆసీస్ స్టార్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్‌పై సైతం కాసుల వర్షం కురవనుంది. ఫ్రాంఛైజీల మధ్య పోటీ తీవ్రంగా ఉండడం ఖాయం. ఆదిల్ రషీద్, సీన్ అబాట్, క్రిస్ లిన్ లాంటి ఆటగాళ్లకు కూడా భారీ ధర పలికే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.