IPL 2023 PBKS vs KKR 2023 Playing 11 Out: ఐపీఎల్ 2023 రెండో రోజు డబుల్ బొనాంజాతో క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ముందుగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇరు జట్లకు ఈ సీజన్లో తొలి మ్యాచ్ కాబట్టి విజయం సాదించేందుకు బరిలోకి దిగుతున్నాయి.
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పగ్గాలను నితీశ్ రాణా అందుకున్నాడు. గత కొన్ని సీజన్లుగా కీలక బ్యాటర్‌గా రాణించిన నితీశ్.. కెప్టెన్‌గానూ సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు గత సీజన్‌లో జట్టును నడిపించిన మయాంక్ అగర్వాల్‌ను పంజాబ్ కింగ్స్ వదిలేసుకున్న విషయం తెలిసిందే. మయాంక్ స్థానంలో భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు సారథిగా అవకాశం కల్పించింది. కొత్త సారథులలో పైచేయి ఎవరిది చూడాలి.
Here's how the two teams are placed ahead of the #PBKSvKKR encounter!
Follow the match - https://t.co/UeBnlhdZdr#TATAIPL pic.twitter.com/qQEEyyeffB
— IndianPremierLeague (@IPL) April 1, 2023
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: మన్‌దీప్ సింగ్, రహమానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చహర్, హర్‌ప్రీత్ బ్రార్.
Also Read: MS Dhoni: 15 ఏళ్ల కిందట దూకుడు ఇప్పుడు ఉండదు.. ఎంఎస్ ధోనీపై సీఎస్‌కే కోచ్ కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.