LSG vs MI IPL 2023 Eliminator: ఐపీఎల్ 2023లో మరో కీలక మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. చెన్నై వేదికగా జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెపాక్ మైదానంలో నేటి రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 26న జరగనున్న క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఓడిన జట్టు మాత్రం ఇంటికి పయనమవుతుంది. కాబట్టి ఎలిమినేటర్ మ్యాచులో గెలిచేందుకే లక్నో, ముంబై బరిలోకి దిగుతున్నాయి. ఇరు జట్లు స్టార్ ఆటగాళ్లతో నిండియున్న నేపథ్యంలో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం తెలుస్తోంది. స్పిన్నర్ కుమార్ కార్తీకేయ స్థానంలో మరో స్పిన్నర్ హృతిక్ షోకీన్ తుది జట్టులోకి తీసుకోనుందట. ఇంపాక్ట్ ప్లేయర్‌గా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ కోసం లక్నో రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఓపెనింగ్ సమస్య కారణంగా విధ్వంసకర ఓపెనర్ కైల్ మైర్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మైర్స్ జట్టులోకి వస్తే పేసర్ నవీన్ ఉల్ హక్ బెంచ్‌కే పరిమితం అవుతాడు. కరణ్ శర్మ స్థానంలో పేసర్ యష్ ఠాకూర్ తుది జట్టులోకి రానున్నాడు.
ముంబైకి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్ ఫామ్ మీదున్నారు. వీరిని అడ్డుకోవడం లక్నో బౌలర్లకు చాలా చాలా కష్టం. ముఖ్యంగా సూర్యను ఆపడం కష్టమే. అయితే బ్యాటింగ్ బాగున్నా.. బౌలింగ్ చాలా నాసిరకంగా ఉండడం ముంబైకి ప్రతికూలత. ఇది లక్నోకు కలిసొచ్చే ఆంశం. మరోవైపు లక్నో బౌలింగ్ ముంబై కంటే కాస్త మెరుగ్గా ఉంది.
తుది జట్లు (అంచనా)
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, కైల్ మేయర్స్, ప్రేరక్ మన్కడ్, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వల్, హృతిక్ షోకీన్.
Also Read: MS Dhoni IPL 2023 Ban: ఐపీఎల్ 2023 ఫైనల్‌కు ముందు చెన్నైకి భారీ షాక్.. ఎంఎస్ ధోనీపై నిషేధం!
Also Read: IPL 2023 Final: చెన్నైతో ఫైనల్లో తలపడే జట్టు ఇదే.. ఆర్ అశ్విన్ జోస్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.