IPL 2022 Retention Players: రషీద్ ఖాన్, కేఎల్ రాహుల్‌లపై వేటు పడనుందా..బీసీసీఐ నిర్ణయమేంటి

IPL 2022 Retention Players: ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్లేయర్ల జాబితాలు విడుదలయ్యాయి. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు చెందిన ఆ ఇద్దరు ఆటగాళ్లపై ఏడాదిపాటు వేటు పడే అవకాశాలున్నాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 1, 2021, 02:23 PM IST
  • ఐపీఎల్ 2022 నుంచి కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లు దూరమయ్యే అవకాశం
  • నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇద్దరు ఆటగాళ్లపై ఫిర్యాదులు
  • ఏడాదిపాటు రాహుల్, రషీద్‌లపై వేటు పడనుందా..
IPL 2022 Retention Players: రషీద్ ఖాన్, కేఎల్ రాహుల్‌లపై వేటు పడనుందా..బీసీసీఐ నిర్ణయమేంటి

IPL 2022 Retention Players: ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్లేయర్ల జాబితాలు విడుదలయ్యాయి. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు చెందిన ఆ ఇద్దరు ఆటగాళ్లపై ఏడాదిపాటు వేటు పడే అవకాశాలున్నాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే.

జనవరి 2022లో జరగనున్న ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌కు(IPL 2022 Mega Auction) అంతా సిద్ధమవుతోంది. ఏ జట్టు ఎవరిని వదులుకుంటుంది..ఎవరిని రిటైన్ చేసుకుంటుందనేది తేటతెల్లమైంది. దీనికి సంబంధించి అన్ని జట్లు రిటైన్డ్ ప్లేయర్స్ జాబితా విడుదల చేశాయి. ఈ నేపధ్యంలో పంజాబ్ కింగ్స్ లెవన్‌కు చెందిన కేఎల్ రాహుల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ల పరిస్థితిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ 15వ సీజన్‌కు ఈ ఇద్దరూ దూరం కావచ్చని తెలుస్తోంది. ఈ ఇద్దరిపై వచ్చిన ఫిర్యాదులే దీనికి కారణంగా తెలుస్తోంది.

ఐపీఎల్ 2022(IPL 2022) మెగా వేలం నేపధ్యంలో ప్రస్తుతం ఉన్న 8 ఫ్రాంచైజీలు కొనసాగించే, వదులుకునే ఆటగాళ్లను ప్రకటించాయి. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు చెందిన కేఎల్ రాహుల్(KL Rahul) ఆ జట్టుతో కొనసాగడానికి ఇష్టపడలేదు. అటు రషీద్ ఖాన్ అయితే 16 కోట్లు చెల్లిస్తేనే జట్టులో ఉంటానని చెప్పినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో కొత్తగా వచ్చిన లక్నో ఫ్రాంచైజీ రాహుల్ , రషీద్ ఖాన్‌లతో సంప్రదింపులు జరిపి..భారీ మొత్తం ఆఫర్ చేయడంతో దాదాపుగా అంగీకరించినట్టు తెలుస్తోంది. దాంతో పంజాబ్, హైదరాబాద్ జట్లు..లక్నో ఫ్రాంచైజీపై(Lucknow Franchisee)ఫిర్యాదు చేసినట్టుగా ఇన్‌సైడ్ స్పోర్ట్స్ ఓ కథనం ప్రచురించింది. 

బీసీసీఐకు (BCCI)చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషయాన్ని అంటే ఫిర్యాదు విషయాన్ని ధృవీకరించినట్టుగా కూడా ఆ కథనంలో ఉంది. రాహుల్‌కు 20 కోట్లు, రషీద్ ఖాన్‌కు(Rashid khan)16 కోట్లు ఇచ్చేందుకు లక్నో ఫ్రాంచైజీ ముందుకొచ్చినట్టు ఆ కధనం సారాంశం. రాహుల్, రషీద్‌లు నిబంధనలకు వ్యతిరేకంగా కొత్త ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకుంటే సదరు ఆటగాళ్లపై ఏడాది పాటు వేటు పడనుంది. బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై ఈ ఇద్దరు ఆటగాళ్ల భవిష్యత్ ఆధారపడి ఉంది. 

Also read: IPL 2022 Highest Earned Players: ఐపీఎల్ 2022లో ఎక్కువ ధర పలకనున్న క్రికెటర్లు వీళ్లే..విరాట్, ధోనీలు కానే కాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News