Shubman Gill Century help India post 235 target to New Zealand: మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 రన్స్ చేసింది. దాంతో న్యూజిలాండ్ ముందు 235 పరుగుల లక్ష్యం ఉంది. టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కివీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ సెంచరీ బాదాడు. 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 126 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాహుల్ త్రిపాఠి (44; 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. కివీస్ బౌలర్లలో మైఖేల్ బ్రాస్‌వెల్, ఇష్ సోధీ, బ్లెయిర్ టిక్నర్ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ రెండో ఓవర్‌లోనే ఔట్ అయ్యాడు. అయినా కూడా శుభ్‌మన్ గిల్ ఒత్తిడికి గురికాలేదు. రాహుల్ త్రిపాఠితో కలిసి 87 పరుగులు జోడించాడు. త్రిపాఠి ఔట్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ (24), హార్దిక్ పాండ్యా (30)తో కలిసి భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కివీస్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ పరుగులు రాబట్టాడు. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ అహ్మదాబాద్ స్టేడియంను హోరెత్తించాడు. గిల్ దెబ్బకు ఫెర్గూసన్, టిక్నర్‌లు 50కి పైగా రన్స్ ఇచ్చుకున్నారు.
Stat Alert 🚨- Shubman Gill now has the highest individual score by an Indian in T20Is 💪👏#TeamIndia pic.twitter.com/8cNZdcPIpF
— BCCI (@BCCI) February 1, 2023
మూడు టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన శుభ్‌మన్ గిల్.. మూడో మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో టీ20 ఫార్మాట్‌లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. 35 బంతుల్లో 50 రన్స్ చేసిన గిల్.. ఆ తర్వాతి 19 బంతుల్లోనే శతకం చేయడం విశేషం. సెంచరీ (Shubman Gill T20 Century) అనంతరం గిల్ ప్రేక్షకుల వైపు తలవంచి అభివాదం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ బాదిన గిల్.. టీ20లోనూ శతకం బాదాడు. ఇక బి భారత్ తరఫున మూడు పార్మాట్లలో శతకం బాదిన ఐదో ఆటగాడిగా గిల్ నిలిచాడు.
Also Read: Sam Billings Run-Out: మెరుపు వేగంతో రనౌట్.. ఎంఎస్ ధోనీని మరిపించిన సామ్ బిల్లింగ్స్! వీడీయో వైరల్
Also Read: ICC T20I Rankings: దుమ్ములేపిన సూర్యకుమార్ యాదవ్.. డేవిడ్ మలన్ ఆల్‌టైమ్ రికార్డుకు ఎసరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.