వామ్మో పాక్ టూర్ ...మేం వెళ్లం అంటున్న శ్రీలంక క్రికెటర్లు !!

పాకిస్థాన్ గడ్డపై అడుపెట్టాలంటేనే ఇతర దేశాల క్రికెటర్లు వణికిపోతున్నారు

Last Updated : Sep 10, 2019, 12:48 AM IST
వామ్మో పాక్ టూర్ ...మేం వెళ్లం అంటున్న శ్రీలంక క్రికెటర్లు !!

ఉగ్రవాదులకు అడ్డాగా నిలిచిన పాక్ గడ్డపై అడుపెట్టాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా శ్రీలంక ఆటగాళ్లు కూడా పాక్ టూర్ కు వెళ్లేందుకు నిరాకరించారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 9 వరకు పాక్ లో శ్రీలంక జట్టు పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఆతిథ్య శ్రీలంక జట్ల పాక్ టీం తో మూడు వన్డేలు, మూడు టి 20 ఆడాల్సి ఉంది. పాక్ పర్యటన నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఆటగాళ్లతో సోమవారం సమావేశమైంది. భద్రతా కారణాల రీత్యా  శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగ సహా 10 మంది ఆటగాళ్లు పాక్ లో పర్యటకు తాము వెళ్లబోమంటూ  బోర్డు సభ్యులకు తెగేసి చెప్పారు. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు శ్రీలంక టూర్ విషయంలో డైలమాలో పడింది.

2009లో పాక్ టెస్టు మ్యాచ్ సందర్భంలో లాహోర్ లో శ్రీలంక ఆటగాళ్ల బస్సుపై ఉగ్రవాదుల దాడి జరిగింది. స్థానిక గాఫాడీ స్టేడియం వద్ద 12 మంది ఉగ్రవాదులు శ్రీలంక క్రికెటర్లు పర్యటిస్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో శ్రీలంక ఆటగాళ్లు గాయాలతో బయటపడగా.. ఆరుగురు పాకిస్థానీ పోలీసులు, ఇద్దరు సామన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్పటి నుంచి ఏ దేశం భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్ వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. అయితే దాదాపు 10 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది. అయితే ఆ పర్యటనకు ప్రధాన ఆటగాళ్లు కాకుండా కొత్త ఆటగాళ్లను పంపించారు.
 

Trending News