క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నేడు 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పుట్టినరోజు (Sunil Gavaskar Birthday) ను పురస్కరించుకుని క్రికెటర్లు, ఆయన అభిమానులు లిటిల్ మాస్టర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన బర్త్‌డే సందర్భంగా ఓ మంచి పనికి గవాస్కర్ శ్రీకారం చుట్టారు. ఐపిఎల్ 2020 నిర్వహణపై స్పందించిన న్యూజిలాండ్
గుండె జబ్బులతో బాధపడుతున్న 35 చిన్నారులకు ఆపరేషన్ చేపించాలని నిర్ణయిం తీసుకున్నారు. ఖార్గర్‌లోని శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్‌లో ఈ చిన్నారులకు హార్ట్ సర్జరీ ఆపరేషన్లకయ్యే ఖర్చును సునీల్ గవాస్కర్ భరించనున్నారు. భారత్ తరఫున ఆయన చేసిన శతకాలకు సమానమైన సంఖ్యలో చిన్నారుల జీవితాలను కాపాడాలని ఈ ప్రయత్నం చేస్తున్నారు. గతేడాది సైతం చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించడం తెలిసిందే. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
‘ఓన్లీ దిల్.. నో బిల్’ అనేది తన కోరిక అని సునీల్ గవాస్కర్ తెలిపారు. చాలా మందికి ఎన్నో రకాల అవసరాలుంటాయని, కానీ అందులో చిన్నారులు ఎప్పటికీ ప్రత్యేకమని అభిప్రాయపడ్డారు. భారత్‌లో గుండెలో లోపంతో పుట్టిన పసివాళ్లు చిన్నవయసులోనే చనిపోతున్నారని తనవంతుగా కొందరికైనా జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సునీల్ గవాస్కర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos