ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరు అభిమానుల మదిలో చిరకాలం గుర్తుండిపోతుంది. అందులో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ ఆట ప్రదర్శన ఐపీఎల్-11 సీజన్‌లోనే హైలెట్‌గా నిలిచింది. 10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో బ్యాటింగ్ (34)లో.. బౌలింగ్ (3/19)లో.. ఫీల్డింగ్ (రెండు క్యాచ్‌లు, ఒక రనౌట్) లో అన్నీ తానే ఒంటిచేత్తో హైదరాబాద్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అతని ఆల్‌రౌండ్ షోకు ఫిదా అయిన వాళ్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రషీద్ హీరో అని.. ఆతని ఆటతీరు పట్ల దేశం మొత్తం గర్వంగా ఫీలవుతున్నట్లు అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ట్విటర్‌లో పేర్కొనారు. సచిన్ లాంటి దిగ్గజాలు సైతం స్పందించి శుభాకాంక్షలు అందజేశారు.
రషీద్ ఖాన్ ప్రతిభకు ఆకర్షితుడైన ప్రిన్స్ మహేష్‌బాబు ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురిపించారు. 'రషీద్ ఖాన్ నీ ఆటకు సలాం. గొప్ప మ్యాచ్‌ను అందించావు. మళ్లీ సండే రోజున జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాను. సన్‌రైజర్స్ జట్టు సభ్యులకు కంగ్రాట్స్' అని ప్రిన్స్ ట్వీట్ చేశారు. దానికి రషీద్ కూడా స్పందించాడు. సమాధానంగా.. ''ధన్యవాదాలు సోదరా! మీ సినిమాలు చూస్తుంటా'' అని ట్వీట్ చేశాడు.
Take a bow @rashidkhan_19... Whatta match by @SunRisers 👏Can't wait for Sunday!!! Congratulations to the whole team. 😊
Go #OrangeArmy #SRH— Mahesh Babu (@urstrulyMahesh) May 25, 2018
Thank you bro 🙌🏻🙌🏻 watching your movies keenly 😊
— Rashid Khan (@rashidkhan_19) May 25, 2018