Ind vs Aus: చివరి బంతి వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్. హైదరాబాద్‌లో జరిగిన టీ20 మూడవ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో విజయంతో సిరీస్ కైవసం చేసుకుంది.
టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇండియా కైవసం చేసుకుంది. సిరీస్‌ను 2-1తో ఇండియా చేజిక్కించుకుంది., హైదరాబాద్‌లో జరిగిన టీ20 మూడవ మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓ దశలో అంటే 7-8 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా దూకుడు చూస్తే..స్కోర్ 220 దాటడం ఖాయమన్పించింది. అయితే ఆ తరువాత టీమ్ ఇండియా వికెట్లు తీయగలగడంతో ఆస్ట్రేలియా స్ట్రైకింగ్ రేట్ తగ్గుతూ వచ్చింది.
ఆ తరువాత 187 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇండియాకు ఆరంభంలోనే కష్టాలెదురయ్యాయి. కేఎల్ రాహుల్ 5 పరుగుల స్కోర్ వద్ద అవుట్ కాగా, రోహిత్ శర్మ 30 పరుగుల స్కోర్ వద్ద వెనుదిరిగాడు. ఆ తరువాత విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను చివరి వరకూ నిలబెట్టారు. 134 పరుగుల వద్ద సూర్య కుమార్ యాదవ్ 69 పరుగులకు అవుట్ అవడంతో అక్కడ్నించి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కొనసాగించాడు. సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లి ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేయడం విశేషం.
చివరి ఓవర్ చివరి రెండు బంతుల వరకూ ఉత్కంఠగా సాగింది మ్యాచ్. మరో మూడు బంతుల్లో 4 పరుగులు అవసరం కాగా విరాట్ కోహ్లీ అవుట్ అవడంతో ఒక్కసారిగా టెన్షన్ నెలకొంది. ఆ తరువాత బంతి డాట్ బాల్ కావడంతో రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమయ్యాయి. హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ ఐదవ బంతిని బౌండరీకు తరలించడంతో టీమ్ ఇండియా విజయం ఖరారైంది. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయంతో సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
Also read: MS Dhoni: ఐపీఎల్ నుంచి MS ధోని రిటైర్మెంట్? మధ్యాహ్నం ప్రకటించనున్న CSK కెప్టెన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook