Kapil Dev: క్రికెట్ ఒత్తిడి అనుకుంటే..అరటి పండ్లో, గుడ్లో అమ్ముకోండంటున్న కపిల్ దేవ్

Kapil Dev: ప్రముఖ ఇండియన్ క్రికెటర్ కపిల్ దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒత్తిడి అనుకుంటే ఎందుకాడుతున్నారు, అరటి పండ్లు లేదా గుడ్లు అమ్ముకోవచ్చు కదా అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 21, 2022, 05:23 PM IST
Kapil Dev: క్రికెట్ ఒత్తిడి అనుకుంటే..అరటి పండ్లో, గుడ్లో అమ్ముకోండంటున్న కపిల్ దేవ్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ క్రికెటర్లపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ ఎక్కువ ఆడటం వల్ల ఒత్తిడికి లోనవుతున్నామనే కామెంట్లను మరోసారి తిప్పికొట్టారు. 

ఐపీఎల్, టీ20 వంటివి అందుబాటులో వచ్చాక ఒత్తిడి ఎక్కువౌతోందని క్రికెటర్లు తరచూ చెబుతున్నారు. గతంలో టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఒత్తిడి ఎక్కువైందనే కారణంగా కొద్దికాలం విరామం తీసుకున్నారు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ ఇలా షెడ్యూల్స్‌లో విరామం లేకపోవడంతో అలసిపోతున్నామని వ్యాఖ్యానించారు. క్రికెట్ ఎక్కువగా ఆడటం వల్ల డిప్రెషన్‌కు గురవుతున్నామని కూడా గతంలో కొంతమంది చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల్ని గతంలో ఓసారి ఖండించిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్..ఇప్పుడు మరోసారి తిప్పికొట్టారు.

ఒత్తిడి అనుకుంటే ఎందుకు ఆడుతున్నారు
అరటి పండ్లో, గుడ్లో అమ్ముకోవచ్చు కదా

ఇటీవలి కాలంలో ఐపీఎల్ ఆడటం వల్ల చాలా ఒత్తిడికి లోనవుతున్నాం.. అనే మాటల్ని తరచూ వింటున్నానని..అలాంటి వారికి ఒకటే చెప్పదల్చుకున్నానని కపిల్ దేవ్ స్పష్టం చేశారు. ఒత్తిడి అనుకుంటే క్రికెట్ ఎందుకు ఆడుతున్నారని, ఎవరు ఆడమన్నారని ప్రశ్నించారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఒత్తిడి ఎలా అవుతుందన్నారు. కోల్‌కతాలోని ఓ కార్యక్రమంలో కపిల్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

100 కోట్ల జనాభా ఉన్న దేశంలో 20 మందికే క్రికెట్ ద్వారా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ప్లెజర్‌గా ఫీలవ్వాలి తప్పిస్తే..ప్రెషర్‌గా ఫీలవ్వకూడదన్నారు. మీకు కష్టంగా ఉంటే ఆడవద్దు..ఎవరూ బలవంతంగా ఆడించడం లేదు కదా అన్నారు. ఒత్తిడి అనుకుంటే అరటి పండ్లో, గుడ్లో అమ్ముకోవచ్చు కదా అన్నారు. కపిల్ దేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

Also read: IPL 2023 Auction: అలాంటి బౌలర్ల కోసమే ముంబై ఇండియన్స్‌ చూస్తోంది.. లేదంటే ఈసారి కష్టమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News