Dinesh Karthik says Thanks to R Ashwin after India beat Pakistan: టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (82 నాటౌట్; 53 బంతుల్లో 6×4, 4×6) చివరి వరకు క్రీజులో నిలబడి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో 1×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో భారత్ ఖాతాలో రెండు పాయింట్స్ చేరాయి.
160 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా కీలక నాలుగు వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏ సమయంలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకున్నారు. భారత్ విజయానికి 3 ఓవర్లలో 48 రన్స్ చేయాల్సి వచ్చింది. దాంతో భారత్ గెలవడం కష్టమే అనిపించింది. షహీన్ షా ఆఫ్రిది వేసిన 18వ ఓవర్లో కోహ్లీ మూడు బౌండరీలు బాదడంతో.. 17 పరుగులు వచ్చాయి. దాంతో చివరి 2 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సి వచ్చింది. 19వ ఓవర్లో హారిస్ రవూఫ్ మొదటి 4 బంతుల్లో మూడే పరుగులు ఇచ్చాడు. దాంతో విజయ సమీకరణం 8 బంతుల్లో 28 పరుగులుగా మారింది. ఈ స్కోర్ చూసి అందరూ భారత్ ఓటమి ఖాయం అనుకున్నారు.
19వ ఓవర్లోని చివరి రెండు బంతులకు విరాట్ కోహ్లీ సిక్సులు బాదేశాడు. దాంతో ఓవర్‌లో భారత్ లక్ష్యం 16 పరుగులుగ మారింది. స్పిన్నర్ మొహ్మద్ నవాజ్ బంతిని అందుకోగా.. హార్దిక్ పాండ్యా స్ట్రైకింగ్‌లో ఉండడంతో భారత్ గెలుపు సులువే అనుకున్నారు. సిక్సర్ బాదుతాడనుకున్న హార్దిక్.. తొలి బంతికే ఔట్ అయ్యాడు. రెండో బంతికి దినేష్ కార్తీక్ సింగిల్ మాత్రమే తీశాడు. మూడో బంతికి కోహ్లీ రెండు పరుగులు చేశాడు. దాంతో విజయ సమీకరణం 3 బంతుల్లో 13 పరుగులుగా మారింది. నాలుగో బంతిని నవాజ్ ఫుల్‌టాస్ వేయగా.. కోహ్లీ సిక్సర్ బాదేశాడు. అది నోబాల్ కావడంతో 3 బంతుల్లో 6 పరుగులే చేయాల్సి వచ్చింది. అదనంగా ఫ్రీహిట్ కూడా దొరికింది. నవాజ్ వేసిన నాలుగో బంతి వైడ్. మరుసటి (నాలుగో) బంతికి కోహ్లీ బౌల్డయినా.. ఫ్రీహిట్ కావడంతో భారత బ్యాటర్లు (కోహ్లీ, డీకే) మూడు పరుగులు తీశారు.
Hello Sydney 👋
We are here for our 2⃣nd game of the #T20WorldCup! 👏 👏#TeamIndia pic.twitter.com/96toEZzvqe
— BCCI (@BCCI) October 25, 2022
భారత్ విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. మొహ్మద్ నవాజ్ వేసిన ఐదో బంతికి దినేష్ కార్తీక్ స్టంపౌట్ అయ్యాడు. ఆరో బంతికి ఆర్ అశ్విన్ స్ట్రైకింగ్‌కు రాగా.. వైడ్ బాల్ పడింది. దాంతో భారత్ విజయానికి ఒక్క పరుగు మాత్రమే అవసరం అయింది. చివరి బంతికి యాష్ సింగిల్ తీయడంతో.. భారత్ గెలిచింది. చివరి బంతికి సింగిల్ తీసి జట్టును గెలిపించిన అశ్విన్‌కు దినేష్ కార్తీక్ థాంక్స్ చెప్పాడు. బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసిన వీడియోలో డీకే మాట్లాడుతూ.. 'మ్యాచ్‌ను గెలిపించినందుకు దన్యవాదాలు. నన్ను సేవ్ చేసినందుకు వెరీ థాంక్స్' అని అన్నాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఒకవేళ భారత్ ఓడితే అనవసర షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్న డీకేను నెటిజన్లు ఓ ఆటాడుకునేవారు.
Also Read: Pooja Hegde Pics: దీపావళి స్పెషల్.. దేవకన్యలా మెరిసిపోతున్న పూజా హెగ్డే!
Also Read: పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్ విజయం.. ఇలా అయితే భారత్ సెమీ ఫైనల్‌కు ఈజీగా చేరుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి