Virat kohli Trolls Kieron Pollard: విరాట్ కోహ్లీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మైదానంలోకి దిగాడంటే.. పరుగుల వరద పారాల్సిందే. ముందుగా బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ అయినా దూకుడుగా ఆడుతాడు. ఇక ఎవరైనా బౌలర్ కవ్వించాడంటే.. అతడు బలవ్వాల్సిందే. తన మాటలతోనే కాకుండా.. బ్యాట్‌తో కూడా సమాధానం చెపుతాడు. అదే సమయంలో కోహ్లీ సరదాగా కూడా ఉంటాడు. మైదానంలోని ఆటగాళ్లను తన మాటలు, చేష్టలతో నవ్విస్తుంటాడు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో కీరన్ పొలార్డ్‌పై విరాట్ కోహ్లీ సెటైర్ వేయగా.. రోహిత్ శర్మ పడిపడి నవ్వుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ 8వ ఓవర్‌ను స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ వేశాడు. ఆ ఓవర్లోని మూడో బంతిని కోహ్లీ మిడాన్ దిశగా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఛేజ్ వేగంగా స్పందించి.. ఆ బంతిని పట్టుకొబోయాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రోహిత్.. ఛేజ్‌ను ఢీకొట్టకుండా ఉండేందుకు పక్కకి జరిగాడు. బంతి మాత్రం రోహిత్‌ని తాకి వికెట్ల వైపు వెళ్లింది.
రోస్టన్ ఛేజ్ వేగంగా స్పందించి బంతిని అందుకుని వికెట్ల పైకి విసిరాడు. అప్పటికే రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చేశాడు. అయితే వికెట్లను తాకని బంతి పిచ్ మధ్యలోకి దూసుకెళ్లింది. మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ కీరన్ పొలార్డ్ బంతిని అందుకుని టీమిండియా సారథిని రనౌట్ చేసే ప్రయత్నం చేశాడు. రోహిత్ క్రీజులో ఉండడంతో.. బంతిని ఛేజ్‌కి విసిరాడు. ఇది గమనించిన విరాట్ కోహ్లీ.. 'రోహిత్‌ని అలా రనౌట్ చేయలేవు పొలార్డ్' అని కామెంట్ చేశాడు. వెంటనే రోహిత్ నవ్వుకున్నాడు. పొలార్డ్ కూడా కోహ్లీ వైపు చూస్తూ చిరునవ్వు చిందించాడు.
Virat Kohli to Pollard when he was trying to run out Rohit in a funny way.
"YOU CAN'T RUN HIM LIKE THAT POLLY" pic.twitter.com/XasccpaEe5— Cricket Holic (@theCricketHolic) February 18, 2022
విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు అక్కడి స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. అందుకు సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. వరుసగా విఫలమవుతున్న కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా సత్తాచాటాడు. బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ పరుగులు చేశాడు. కీలక సమయంలో హాఫ్ సెంచరీ (52: 41 బంతుల్లో 7×4, 1×6) బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే 2-0తో విండీస్‌పై టీ20 సిరీస్ కైవసం చేసుకోవడంతో కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read: Rohit Sharma Trolls: రోహిత్.. ఓ కెప్టెన్ అయుండి అలానేనా చేసేది! ధోనీని చూసి నేర్చుకో!!
Also Read: Earwax Removal: ఇయర్ బడ్స్‌తో చెవిలో గులిమిని క్లీన్ చేయడం మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook