AP 10th Class Exams: ఏపీలో పదోతరగతి పరీక్షలు జరుగుతున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. మొన్నటివరకు ప్రశ్నాపత్రాల లీక్ తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. మరికొన్ని చోట్ల పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత వాట్సాప్ స్టేటస్‌లో కనిపించాయి.
కర్నూలు జిల్లా పంచలింగాల సబ్ చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి బిస్కెట్లు, 90 లక్షల నగదు పట్టుకున్నారు. వెంకటేష్ అనే వ్యక్తి వినూత్న రీతిలో షర్ట్, జాకెట్లోపల వాటిని దాచిపెట్టి హైదరాబాద్ నుంచి కొయంబత్తూరుకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో తీసుకెళ్తున్నాడు. పోలీసులు తనిఖీలు చేస్తుండగా పట్టుపట్టాడు. అతనిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూ.. చాలామంది నాయకులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కరోనా బారిన పడి కన్నుమూశారు.
Kurnool Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ ఢీకొన్ని ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కర్నూలు జిల్లాలోని సంకల్ బాగ్ ఘాట్‌లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి, తుంగభద్ర నదికి పసుపు, కుంకుమ సారె సమర్పించారు.
వాకింగ్‌కు వెళ్లిన వైఎస్సార్సీపీ నేత దారుణహత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం సుబ్బారాయుడు వాకింగ్‌కు వెళ్లగా మాటువేసిన కొందరు దుండగులు ఒక్కసారిగా కర్రలతో దాడి చేసి దారుణహత్య (YSRCP Leader Murdered In Kurnool District)కు పాల్పడ్డారు.
రోజులు మారిపోయాయి. కొత్త చట్టాలు వచ్చాయి. అయినా మహిళలపై వేధింపులు, మోసాలు జరుగుతున్నాయి. దీంతో ఓ యువతి తిరగబడింది. తనను మోసం చేసిన యువకుడిపై యాసిడ్ దాడులకు (Nandyal Acid Attack) పాల్పడుతోంది. ఈ వారంలో రెండోసారి యాసిడి దాడికి పాల్పడిందని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.