ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రత్యేక హోదా సాధన సమితి, తమ మద్దతుని అందివ్వమని మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్
(మా)ను అడగడం జరిగింది
ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి తనకు ఒక విషయమైతే కచ్చితంగా అవగతమైందని.. అమిత్ షా లేఖలో రాసిన అంశాలను బట్టి.. దానికి ప్రతిగా చంద్రబాబు చెప్పిన
సమాధానాలు బట్టి చూస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే సూచనలు కనిపించడం లేదని అర్థమవుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అధికార పార్టీగా ఉండి కూడా... ఏపీ విషయంలో ఒకానొక సందర్భంలో ప్రత్యేక హోదా అంశాన్ని సమర్థించిన విషయం తెలిసిందే.
తెలుగు ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ఉభయ సభలు మార్మోగాయి. ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే విభజన హామీలు, ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబడుతూ టీడీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఇదే సమయంలో రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ సభ్యులు కూడా ఆందోళనకు దిగడంతో స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టకుండానే సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఇటు రాజ్యసభలో కూడా ఇదే గందరగోళ పరిస్థితి. సభ ప్రారంభంకాగానే తెలుగు ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేపట్టారు. ఛైర్మన్ వెంకయ్యనాయడు సభ్యులను ఎంతగా వారించిన సభ్యులు వినకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.
జనసేన పార్టీని రాజకీయ లబ్ది గల పార్టీగా చూడకూడదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ రోజు అమరావతిలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన వివిధ అంశాలపై స్పందించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్య విషయాలు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని.. ఆ హోదాకి తీసిపోని విధంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవలి కాలంలో మరోమారు స్పష్టం చేశారు.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపటి పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీయే ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఎన్డీయే నుంచి వైదొలిగే ఆలోచన కూడా చేస్తోంది. ఉయదం నుంచి పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో మంత్రులు, పార్టీకి చెందిన కీలక నేతలు పాల్గొన్నారు.
విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు లోక్ సభను స్తంభింపచేస్తున్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే టీడీపీ ఎంపీల నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ప్లకార్లులతో నిరసన ప్రదర్శన చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళవారతావరణం నెలకొంది. దీంతో లోక్ సభ స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇటు రాజ్యసభలోనూ ఇదే తీరు కొనసాగించింది. ఏపీకి న్యాయం చేయాలని టీడీపీ ఎంపీలు ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు చేతపట్టుకొని నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను వాయిదా వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.