భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకున్న కేంద్ర విమానయాన శాఖమంత్రి పూసపాటి అశోకగజపతి రాజు మరియు కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సహాయమంత్రి సుజనా చౌదరిలు తమ రాజీనామా లేఖలను ఆయనకు సమర్పించారు.
ఏపీ స్పెషల్ స్టేషస్ కోసం ఢిల్లీ వీధుల్లో రాజకీయ పార్టీలు , ప్రజా సంఘాల ఆందోళన కొనసాగుతోంది. విభజన హామీల కోసం రెండు రోజులగా పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఏపీ ఎంపీలు గట్టిగా నిలదీస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఎంపీల ధర్న చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ స్ట్రీట్ లో ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద వైసీపీ నేతలు ఆందోళన కొనసాస్తున్నారు. ప్రజా సంఘాలు పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడంతో ప్రత్యేక హోదా సెగ ఢిల్లీ పెద్దలకు తాకింది.
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని మరో సారి స్పష్టం చేసింది. ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఏపీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం ఆర్ధిక శాఖ కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. నిన్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో ఏపీ ఆర్ధిక మంత్రి యనమల భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి యనమలకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని జైట్లీ తేల్చిచెప్పారు. ఈ సందర్భంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని యనమల గట్టిగా అడిగినట్లు తెలిసింది. అయితే ఏపీకి హోదా ఇవ్వలేమని ప్యాకేజీ మాత్రమే అమలు చేస్తామని చెప్పినట్లు తెలిసింది.
పార్లమెంట్ ఉభయ సభలు తెలుగు ఎంపీల నినాదాలతో దద్దరిల్లించింది. ప్రత్యేక ప్యాకేజీపై ఆంధ్రప్రదేశ్ ఎంపీలు నిరసన వ్యక్తం చేయగా.. తెలంగాణలో రిజర్వేషన్ కోటా పెంచాలని కోరుతూ టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేట్టారు. సోమవారం ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే మాజీ పార్లమెంట్ సభ్యులు కమలాప్రసాద్సింగ్, రుడాల్ఫ్ రోడ్రిగ్స్, ఖాగెన్దాస్, కుమారి ఫరీదాల మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రత్యేక హోదా అంశం ఢిల్లీ రాజకీయలను ప్రభావితం చేసే దిశగా కదులుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై పోరుబాట పట్టాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ, వైపీపీ, కాంగ్రెస్ ఎంపీలు తమదైన శైలిలో నిరసనలు తెలుపుతున్నాయి. ఈ ఉదయం టీడీపీ ఎంపీలు గాంధీ విగ్రహం ముందు నిలబడి ప్లకార్డులు పట్టుకుని ఏపీకి తక్షణం ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిన్న హోదా అంశంపై ఢిల్లీలో మహాధర్నా చేపట్టిన వైసీపీ రెండో రోజు కూడా తమ ఆందోళనను కొనసాగిస్తోంది. మరోవైపు ఆంధ్రుల ఆత్మ గౌరవ దీక్ష పేరుతో మూడు రోజుల పాటు దీక్షలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
జనసేన ఆధ్వర్యంలో నియమించిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (నిజనిర్థారణ కమిటీ) సమావేశాలకు వచ్చిన కార్యకర్తలు, మిగతా పార్టీల ప్రతినిధులు, మీడియా సంస్థల ప్రతినిధులు అందరికీ జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రత్యేక హోదా విషయం గురించి పోరాడుతూ.. కేంద్రంపై ఒకవేళ టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. తాను మద్దతిస్తానని.. అయితే ప్యాకేజీ విషయాన్ని పక్కనపెట్టి..కేవలం ప్రత్యేక హోదా నిమిత్తమే నిజాయతీగా పోరాడాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
లోక్సభలో టీడీపీ ఎంపీలు అలజడి సృష్టించారు. బడ్జె్ట్లో ఏపీకి ఏమీ ఇవ్వలేదని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఎంపీలు ఆందోళన చేయగా.. వారిపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన వ్యవస్థాపకులు పవన్ కల్యాణ్ కొద్ది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజాయాత్రను ప్రారంభిస్తారని ఆ పార్టీ మీడియా వ్యవహారాల ఇన్ఛార్జి హరిప్రసాద్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇక వీలున్నప్పుడల్లా ప్రజానీకంతో మమేకమవుతూ.. వారి మధ్యకు వచ్చి వారి సమస్యలను తెలుసుకుంటారని ఆయన తెలియజేశారు. 2014లో అప్పటి రాజకీయ కారణాల మేరకు, ప్రజల పరిస్థితి మేరకు, జనసేన పార్టీ తెదేపా - భాజాపా కూటమికి మద్దతిచ్చిందని... కానీ నేటి పరిస్థితులు వేరని.. తాము ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది సమయమే నిర్ణయిస్తుందని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.