మహారాష్ట్ర ( Maharashtra) లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడటంతో (bus Accident) ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. 35 మంది గాయాలపాలయ్యారు.
కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ వాసులు శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన 42 మంది వలస కూలీలు ( Migrant workers from West Bengal ) ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు బాలిగాం సమీపంలో బోల్తా పడింది.
హైదరాబాద్-విజయవాడ రహదారిపై ప్రమాదవశాత్తు అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయాపడ్డారు. క్షతగాత్రుల్లో పదిమంది వరకు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద సోమవారం తెల్లవారుఝమున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బీహార్‌లోని మోతీహర ప్రాంతంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో మంటలు చెలరేగి.. 27 మంది సజీవ దహనమయ్యారని సమాచారం. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.