Pakistan Super League postponed due to COVID-19: పాకిస్థాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌ని ఉన్నఫళంగా వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పాల్గొంటున్న వారిలో గురువారం మరో ముగ్గురు క్రికెటర్స్‌కి COVID-19 పాజిటివ్ రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ స్పష్టంచేసింది.
ఢిల్లీలో కరోనావైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో కరోనా కారణంగా తీవ్ర ప్రభావానికి గురైన మహారాష్ట్ర సర్కార్ మరోసారి ఆలోచనలో పడింది. పరిస్థితి చేయి దాటి పోకముందే తేరుకోకపోతే.. మహారాష్ట్రలో సైతం సెకండ్ వేవ్ చూడాల్సి వస్తుందని మహారాష్ట్ర సర్కార్ ఆందోళనకు గురవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 7,855 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus ) నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,54,386కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 69,353 యాక్టివ్ కేసులు ఉండగా మరో 5,79,474 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి 60వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా మరోసారి వేయి దాటడం అందరినీ కలవరపెడుతోంది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే.. దేశంలో వరుసగా ఏడో రోజు కూడా 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) పాజిటివ్ కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజులతో పోల్చితే.. వేయికి తక్కువగా కేసులు నమోదు కావడం కొంత ఊరట కలిగిస్తోంది.
కరోనావైరస్ వ్యాప్తిపై ( Coronavirus ) ఏ రోజుకు ఆరోజు రాత్రి పూట తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తోన్న కొవిడ్-19 హెల్త్ బులెటిన్ ( COVID-19 health bulletin ) ఇవాళ విడుదల కాలేదు. ఇవాళ్టి హెల్త్ బులెటిన్‌ని రేపు ఆదివారం కొత్త విధానంలో విడుదల చేస్తామని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ( CM Shivraj Singh Chouhan ) కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రాష్ట్ర ప్రజలకు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు కరోనావైరస్ లక్షణాలు ( Coronavirus symptoms ) కనిపించడంతో కొవిడ్-19 పరీక్షలు చేయించుకున్నానని సీఎం ట్వీట్ చేశారు.
తెలంగాణలో శుక్రవారం 15,445 మందికి కరోనావైరస్ పరీక్షలు చేయగా.. 1640 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ఇందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 683 కేసులు నమోదయ్యాయి.
అమరావతి: వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుకు ( Ambati Rambabu ) కరోనావైరస్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంపై పార్టీ శ్రేణులు, ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో తన ఆరోగ్యం, యోగక్షేమాలపై ఆందోళన చెందుతున్న వారికి సమాధానం చెబుతూ అంబటి రాంబాబు నేరుగా ఓ వీడియో విడుదల చేశారు.
COVID-19 cases:హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు మొత్తం 11,062 కరోనా పరీక్షలు ( Coronavirus tests ) చేయగా.. 1,178 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 33,402 కి చేరుకుంది.
Coronavirus in AP: అమరావతి: ఏపీలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం 20,590 శాంపిల్స్ పరీక్షించగా.. 1,775 మందికి కరోనావైరస్ ( COVID-19 ) సోకినట్టు తేలింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 17 మంది కరోనాతో చనిపోయారు.
COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 1,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. నేడు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 762 కేసులు నమోదయ్యాయి. తాజాగా విడుదలైన కోవిడ్-19 హెల్త్ బులెటిన్ ( COVID-19 health bulletin ) ప్రకారం కరోనావైరస్ కారణంగా ఇవాళ ఎనిమిది మంది మృతి చెందారు.
COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో గురువారం కొత్తగా 1,410 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎప్పటిలాగే అందులోనూ జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే మొత్తం 918 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ హెల్త్ బులెటిన్ ( Health bulletin ) విడుదల చేసింది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూలై 3, శుక్రవారం రోజున ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 1,658 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.